عن عثمان بن عفان رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ».  
                        
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 245]
                        
 المزيــد ... 
                    
ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్  రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.” 
                                                     
                                                                                                    
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 245]                                            
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే సున్నత్ విధానాన్ని అనుసరించి, ఉదూ చేయునపుడు ఆచరించవలసిన అన్ని విషయాలను ఆచరిస్తూ, పరిపూర్ణంగా ఉదూ చేస్తాడో, అటువంటి ఉదూ అతని వల్ల జరిగిన చెడు పనులు,మరియు పాపములకు పరిహారంగా మారుతుంది – చివరికి అతని కాలి మరియు చేతుల వేళ్ళ క్రిందనుంచి అవి అతడి నుంచి దూరమవుతాయి.