عن جَرِيْر بنِ عبدِ الله رضي الله عنه قال:
كُنَّا عِنْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَنَظَرَ إِلَى الْقَمَرِ لَيْلَةً -يَعْنِي الْبَدْرَ- فَقَالَ: «إِنَّكُمْ سَتَرَوْنَ رَبَّكُمْ كَمَا تَرَوْنَ هَذَا الْقَمَرَ، لَا تُضَامُونَ فِي رُؤْيَتِهِ، فَإِنِ اسْتَطَعْتُمْ أَنْ لَا تُغْلَبُوا عَلَى صَلَاةٍ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا فَافْعَلُوا» ثُمَّ قَرَأَ: «{وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ الْغُرُوبِ}»
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 554]
المزيــد ...
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నాము. రాత్రి ఆయన చంద్రుని వైపు చూసినారు – అంటే పూర్ణ చంద్రుడిని – చూసి ఇలా అన్నారు: “నిశ్చయంగా మీరు ఏ విధంగానైతే ఈ పూర్ణ చంద్రుడిని చూస్తున్నారో, ఆ విధంగా మీరు మీ ప్రభువును చూస్తారు; ఆయనను (కనులారా) చూడడంలో మీరు ఎటువంటి ఇబ్బందినీ ఎదుర్కొనరు. కనుక సూర్యుడు ఉదయించడానికి ముందు నమాజును (ఫజ్ర్ నమాజును) మరియు అతడు అస్తమించడానికి ముందు నమాజును (అస్ర్ నమాజును) ఆచరించకుండా ఉండేలా చేసే దేనినైనా, మిమ్మల్ని లొంగదీసుకోకుండా చేయగలిగే సామర్థ్యం మీకు ఉంటే అలా చేయండి (అంటే ఆ నమాజులను వదలకుండా ఆచరించండి)”. తరువాత వారు ఈ ఆయతును పఠించినారు “....వసబ్బిహ్ బిహంది రబ్బిక ఖబ్ల తులూఇష్షంసి వ ఖబ్లల్ గురూబి” (“....మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా”) (సూరహ్ ఖాఫ్ 50:39)
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 554]
సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నపుడు ఒక రాత్రి ఆయన చంద్రుని వైపు చూసి, అంటే పదునాలుగవ రాత్రి నాటి పూర్ణచంద్రుడిని; చూసి ఇలా అన్నారు: నిశ్చయంగా విశ్వాసులు తమ కళ్ళతో స్వయంగా కనులారా తమ ప్రభువును చూస్తారు; ఎటువంటి సందేహము లేకుండా. సర్వోన్నతుడైన తమ ప్రభువును చూడడానికి వారు గుంపులుగా గుమిగూడరు; వారికి ఎటువంటి అలసటా కలుగదు; మరియు ఎటువంటి కష్టమూ ఎదుర్కొనరు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: ఫజ్ర్ నమాజును మరియు అస్ర్ నమాజును ఆచరించకుండా చేసే ప్రతి దాన్ని కత్తిరించ గల సామర్థ్యం మీకుంటే అలా చేయండి, ఆ నమాజులను సంపూర్ణముగా వాటి నిర్ధారిత సమయాలలో, జమాఅత్’తో ఆచరించండి. ఎందుకంటే అది, సర్వశక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క ముఖమును చూడడానికి అవకాశం కల్పించే కారణాలలో నిశ్చయంగా ఒకటి. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు: “....వసబ్బిహ్ బిహంది రబ్బిక ఖబ్ల తులూఇష్షంసి వ ఖబ్లల్ గురూబి” (“....మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా”) (సూరహ్ ఖాఫ్ 50:39)