عن عبد الله بن عمر رضي الله عنهما قال:
سَمِعَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلًا يَعِظُ أَخَاهُ فِي الْحَيَاءِ، فَقَالَ: «الْحَيَاءُ مِنَ الْإِيمَانِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 36]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక వ్యక్తి తోటి సహోదరునితో ‘వినయం, నమ్రత కలిగి ఉండు’ అని అంటూ ఉండగా విన్నారు. అపుడు ఆయన ఇలా పలికారు “‘అల్ హయా’ (వినయము, నమ్రత) కలిగి ఉండుట విశ్వాసములో ఒక భాగము”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 36]
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి తన సోదరుణ్ణి మరీ ఎక్కువ సిగ్గు పడరాదని అతడిని మందలించగా విన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్-హయా’ కలిగి ఉండుట (స్వభావములో వినయము, నమ్రత కలిగి ఉండుట) విశ్వాసములోని భాగము అని, అది కేవలం మంచినే తోడుకుని వస్తుంది అని అతడికి వివరించినారు.
ప్రవృత్తిలో వినయము, నమ్రత కలిగి ఉండుట అనేది వికారము కలిగించే పనులనుండి దూరంగా ఉంచుతుంది, అందమైన పనులు చేయుటకు దారి తీస్తుంది.