+ -

عن أبي هريرة رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال:
«مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصْمُتْ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيُكْرِمْ جَارَهُ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 47]
المزيــد ...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, (పలికితే) మంచి మాటలే పలకాలి లేదా మౌనంగా ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన పొరుగు వాని పట్ల ఔదార్యము, ఉదార వైఖరి కలిగి ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన అతిథికి (వీలైనంతలో) ఆదరపూర్వకం గా అతిథి సత్కారాలు చేయాలి”.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 47]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు: అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసించుట – దాసుడు చివరికి మరలవలసినది ఈ రెండు విషయాల వైపునకే. అక్కడ అతని విశ్వాసము మరియు ఆచరణల ఆధారంగా అతనికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. కనుక ఎవరైతే అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసిస్తారో, వారు ఈ లక్షణాలు కలిగి ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధిస్తున్నారు.
మొదటిది: మంచి మాటలు పలుకుట/మాట్లాడుట: ఇందులో అల్లాహ్ నామమును స్మరించుట, ఉదాహరణకు ‘తహ్లీల్’ (లా ఇలాహ ఇల్లాల్లాహ్), ‘తక్బీర్’ (అల్లాహు అక్బర్), ‘తమ్’హీద్’ (అల్-హందులిల్లాహ్) మొదలైనవి, మంచి చేయమని ఉద్బోధించుట, ఆదేశించుట, చెడు నుండి ఆపుట, నిరోధించుట, అలాగే, వ్యక్తుల మధ్య సయోధ్య కుదుర్చుట, వారికి సన్మార్గము వైపునకు మార్గదర్శనం చేయుట మొదలైనవన్నీ ఉన్నాయి. ఒకవేళ అతడు ఇది చేయలేకపోతే, అపుడు అతడు కనీసం మౌనంగానైనా ఉండాలి, ఎవరికీ హాని, నష్టము కలిగించే రీతిలో మాట్లాడకుండా తన నాలుక పట్ల జాగ్రత్త వహించాలి.
రెండవది: పొరుగు వానిని గౌరవించుట: అతనికి నష్టము కలిగించరాదు. అతని పట్ల గౌరవము, ఔదార్యము కలిగి ఉండాలి.
మూడవది: మిమ్మల్ని చూడడానికి మీ ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించాలి: అతిథుల పట్ల ఆదరణ, గౌరవము కలిగి ఉండాలి, వారికి వీలైనంతలో తగిన విధంగా అతిథి సత్కారాలు చేయాలి.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Урумӣ Канада الولوف البلغارية Озарӣ الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. అన్ని రకాల ‘మంచికి’ మూలము అల్లాహ్ నందు మరియు అంతిమ దినము నందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండుట. అటువంటి విశ్వాసము ‘మంచి’ చేయుటకు ప్రేరణ కలిగిస్తుంది.
  2. ఇందులో నాలుక వలన కలిగే చెడు, చెరుపు, హాని, నష్టముల గురించి హెచ్చరిక ఉన్నది.
  3. ఇస్లాం – ఐకమత్యము, ఆత్మీయత, కరుణ మరియు ఔదార్యముల ధర్మము.
  4. ఈ లక్షణాలు ‘విశ్వాసము’ మరియు కీర్తించదగిన ‘సభ్యత’ యొక్క అనేక శాఖలలో కొన్ని.
  5. అతిగా మాట్లాడుట అనేది అప్రియమైన విషయాల వైపునకు లేదా నిషేధించబడిన విషయాల వైపునకు దారి తీస్తుంది. కనుక ‘మంచి’ తప్ప మరేమీ మాట్లాడకుండా ఉండుటలోనే సాఫల్యము ఉన్నది.
ఇంకా