+ -

عن أبِي هُرَيرةَ رضي الله عنه أنَّ رسول الله صلى الله عليه وسلمَ قال:
«إذا قُلْتَ لِصَاحِبِكَ: أَنْصِتْ، يومَ الجمعةِ، والْإِمامُ يَخْطُبُ، فَقَدْ لَغَوْتَ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 851]
المزيــد ...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు పెద్ద పొరపాటు చేసినవాడవు అవుతావు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 851]

వివరణ

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "శుక్రవారనాడు ‘ఖుత్బతుల్ జుమ్’అహ్’ (జుమా ప్రసంగము) వినుట కొరకు హాజరైన వారు విధిగా ఆచరించవలసిన మర్యాద ఏమిటంటే వారు జుమా ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం" అని వివరిస్తున్నారు. అంటే ఇమాం ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం, అందులో చేయబడే సూచనలపై, హెచ్చరికలపై లోతుగా ఆలోచించడం, అవగాహన చేసుకోవడం, అలాగే ఇమాం ప్రసంగిస్తూ ఉండగా ఒక చిన్న మాటైనా సరే మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. మీ ప్రక్కవాడిని “మౌనంగా ఉండు” అని, లేక “విను” అని అన్నా కూడా అతడు జుమా నమాజు యొక్క ఘనతను కోల్పోయిన వాడవుతాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇమాం యొక్క జమా ప్రసంగాన్ని వింటున్న సమయములో చెడును ఖండించడం, సలాంకు జవాబు చెప్పడం, ఎవరైనా తుమ్మి ‘అల్-హందులిల్లాహ్’ అని పలికితే దానికి జావాబు పదాలు పలకడం ఇవన్నీ కూడా నిషేధమే.
  2. ఈ నిషేధానికి ఉన్న ఒకే ఒక మినహాయింపు ఏమిటంటే, ఎవరైనా ఇమాంతో మాట్లాడ దలుచుకున్నా లేక ఇమాం (తన ఎదుట హాజరుగా ఉన్నవారిలో) ఎవరితోనైనా మాట్లాడ దలుచుకున్నా – అలా చేయవచ్చు.
  3. జుమా దినమునాడు ఇవ్వబడే రెండు ఖుత్బాల నడుమ ఉండే విరామ సమయములో, అవసరమైతే మాట్లాడవచ్చు.
  4. ఖుత్బాలో ఇమాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరును ప్రస్తావించినట్లయితే ‘సల్లల్లాహు అలైహి వసల్లం’ అని పలుకవచ్చును; అయితే ఉఛ్ఛ స్వరములో కాకుండా నెమ్మదిగా లోలోపలే అనాలి. ఇదే నియమం ఇమాం దుఆ చేస్తున్నట్లయితే ‘ఆమీన్’ అని పలకడానికి కూడా వర్తిస్తుంది.
ఇంకా