+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:
«إِيَّاكُمْ وَالظَّنَّ؛ فَإِنَّ الظَّنَّ أَكْذَبُ الْحَدِيثِ، وَلَا تَحَسَّسُوا، وَلَا تَجَسَّسُوا، وَلَا تَحَاسَدُوا، وَلَا تَدَابَرُوا، وَلَا تَبَاغَضُوا، وَكُونُوا عِبَادَ اللهِ إِخْوَانًا».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6064]
المزيــد ...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
అనుమానాలకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అనుమానం (మనం మాట్లాడే) మాటల్లోనే అత్యంత అసత్యమైనది, దుర్మార్గమైనది. మరియు మీరు ఒకరిని గురించి ఒకరు ఆరాలు తీయకండి; ఒకరిపైనొకరు గూఢచర్యం చేయకండి; ఒకరిపైనొకరు అసూయ చెందకండి; ఒకరినొకరు వదిలివేయకండి (సంబంధాలు తెంచుకోకండి); మరియు మీరు ఒకరినొకరు అసహ్యించుకోకండి. మరియు ఓ అల్లాహ్ దాసులారా సోదరులుగా ఉండండి.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6064]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ముస్లిముల మధ్య శతృత్వానికి, విభేదాలకు దారితీసే కొన్ని విషయాలను నిషేధిస్తున్నారు మరియు వాటిపట్ల హెచ్చరిస్తున్నారు. వాటిలో ఈ క్రింద పేర్కొనబడినవి ఉన్నాయి:
(అల్ జన్న్) “అనుమానము” – ఇది హృదయంలో సరియైన ఆధారం ఏదీ లేకుండా (ఇతరుల పట్ల) కలిగే ఒక ఆరోపణ. ఇది స్పష్టంగా ఒక అబద్ధపు ప్రకటన.
మరియు (“అత్తహస్సుస్”): ఇది ప్రజల ఆంతరంగిక విషయాలలోనికి కళ్ళు మరియు చెవుల ద్వారా తొంగి చూడడం. (వారి ఆంతరంగిక విషయాలను గురించి ఆరా తీయడం).
మరియు (“అత్తజస్సుస్”): ఇది దాచిపెట్టబడిన విషయాలలోనికి గూఢచర్యం చేయడం; అతి సాధారణంగా చాలా సార్లు ఇది (లోకుల) చెడు పట్ల అయి ఉంటుంది.
మరియు (“అల్ హసద్”): ఇది ఇతరులకు కలిగే అదృష్టాన్ని చూసి, లేక వారి సిరిసంపదలను, వారి ఆడంబర జీవితాన్ని చూసి ఓర్వలేకపోవడం, అసూయ చెందడం.
మరియు (“అత్తదాబుర్”) గురించి: “అత్తదాబుర్” అంటే ఒకరి నుంచి ఒకరు దూరమైపోవడం, ఒకరంటే ఒకరు ముఖం తిప్పేసుకోవడం – సలాం చేసుకోవడం, ఒకరింటికి ఒకరు వెళ్ళి కలవడం, మంచిచెడ్డలు విచారించడం, మొదలైనవి అన్నీ వదిలి వేయడం.
మరియు (“అత్తబాఘదూ”): అంటే ఒకరినొకరు అసహ్యించుకోవడం, దూరంగా ఉంచడం, అమర్యాదగా ప్రవర్తించడం, వారికి హాని కలిగించడం.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ముస్లిముల మధ్య సమన్వయం, సఖ్యత పెంపొందింపజేసే ఒక సమగ్ర వాక్యాన్ని పలికారు – ఓ అల్లాహ్ దాసులారా! సోదరులై ఉండండి అని. సహోదరత్వం అనేది బంధుత్వాలలో చోటుచేసుకునే పొరపొచ్చాలను నయం చేసే ఒక బంధం. అది బంధుత్వాల మధ్య ప్రేమను, సామరస్యాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف Озарӣ الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఎవరిలోనైతే చెడు ఆలోచనలు తలెత్తుతాయో అవి అతనికి హాని కలిగించవు, అయితే ఒక విశ్వాసి జ్ఞానవంతుడు మరియు తెలివిగలవాడై ఉండాలి మరియు చెడు మరియు అనైతిక వ్యక్తులచే మోసపోకూడదు.
  2. ఇక్కడ అర్థం ఏమిటంటే, హృదయంలో గూడుకట్టుకుని
  3. స్థిరపడిపోయే అనుమానం పట్ల మరియు ఆ అనుమానాన్ని అంటిపెట్టుకుని ఉండడం పట్ల ఒక హెచ్చరిక. అలా కాకుండా హృదయంలో తలెత్తిన అనుమానం అక్కడే స్థిరపడిపోకుండా సమసి పోయినట్లయితే ఈ హెచ్చరిక అటువంటి వారికి వర్తించదు.
  4. ముస్లిం సమాజంలోని సభ్యుల మధ్య అసమ్మతి మరియు ఒకరికొకరిని దూరం చేసే కారణాలను నిషేధించడం, ఉదాహరణకు గూఢచర్యం, అసూయ మరియు ఇలాంటివి.
  5. ఇందులో ఒక ముస్లింను అన్ని విషయాలలో సోదరునిగా భావించాలి, అతనితో సామరస్యతను, ఐకమత్యాన్ని కొనసాగించాలి అనే హితబోధ ఉన్నది.
ఇంకా