+ -

عن عبد الله بن عمرو رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم:
«يقالُ لصاحبِ القرآن: اقرَأ وارتَقِ، ورتِّل كما كُنْتَ ترتِّل في الدُنيا، فإن منزِلَكَ عندَ آخرِ آية تقرؤها».

[حسن] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وأحمد] - [سنن أبي داود: 1464]
المزيــد ...

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు :
(పాపంచిక జీవితములో) తన మనసును ఖుర్’ఆన్ పఠనములో లగ్నము చేసుకున్న వానితో (తీర్పు దినమున) ఇలా అనడం జరుగుతుంది “ఏవిధంగానైతే నీవు ప్రాపంచిక జీవితములో ఖుర్’ఆన్ ను హృద్యంగా పఠించే వానివో అలా పఠిస్తూ (స్వర్గములో ఉన్నత స్థానములను) అధిరోహిస్తూ ఉండు. ఎక్కడైతే నీవు ఆఖరి ఆయతును పఠిస్తావో అదే నీ గమ్యస్థానము అవుతుంది.

[ప్రామాణికమైనది] - - [سنن أبي داود - 1464]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ప్రాపంచిక జీవితములో ఎవరైతే ఖుర్’ఆన్ ను పఠిస్తూ ఉంటాడో, అందులో ఉన్న దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటాడో, మరియు తాను పఠిస్తున్న దానికి, తాను కంఠస్థం చేసిన దానికి కట్టుబడి ఉంటాడో, అతడు స్వర్గములో ప్రవేశించిన తరువాత అతనితో ఇలా అనడం జరుగుతుంది “ఖుర్’ఆన్ ను పఠిస్తూ ఉండు మరియు స్వర్గములో ఉన్నత స్థానములను అధిరోహిస్తూ ఉండు. ప్రపంచములో ఏ విధంగానైతే నీవు హృద్యంగా పఠించేవాడివో, (పఠిస్తున్న దానిలో) ఏ విధంగానైతే పూర్తి భరోసా మరియు నమ్మకముతో పఠించే వానివో అలా పఠించు. నీవు పఠించే చివరి ఆయతే నీ నివాస స్థానము అవుతుంది.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ బోస్నియన్ సింహళ హిందీ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада Озарӣ الأوزبكية الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసు ద్వారా – తీర్పు దినము నాడు ప్రతిఫలము ప్రాప్తమగుట అనేది ఆచరణల యొక్క నాణ్యత మరియు శ్రేష్ఠతలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తున్నది.
  2. ఇందులో ఖుర్’ఆన్ ను పఠించుట, దానిని మననం చేయుట, అందులో నిపుణత, సంపూర్ణత సాధించుట, పఠించిన దానిని అవగాహన చేసుకొనుట మరియు దాని ప్రకారం ఆచరించుట – ఈ విషయాల వైపునకు ప్రోత్సాహము ఉన్నది.
  3. ఇందులో – స్వర్గము అనేక దశలు కలిగి ఉంటుందని మరియు అందులో ప్రవేశించే వారి స్థానములు అనేకముగా ఉంటాయని, (పైన వివరించిన విధంగా) ఎవరైతే ‘ఖుర్’ఆన్ ను’ తమ జీవితాలలో ఒక భాగంగా చేసుకుంటారో వారు స్వర్గములో ఉన్నతమైనా స్థానాలను పొందుతారని తెలుస్తున్నది.
ఇంకా