عن أبي صِرْمة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«مَنْ ضَارَّ ضَارَّ اللهُ بِهِ، وَمَنْ شَاقَّ شَقَّ اللهُ عَلَيْهِ».
[حسن] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 1940]
المزيــد ...
అబీ సిర్మహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైనా ఇతరులకు హాని కలిగించినట్లయితే, అల్లాహ్ అతనికి హాని కలుగజేస్తాడు. మరియు ఎవరైనా ఇతరులను కఠిన పరిస్థితులకు లోను చేసినట్లయితే, అల్లాహ్ అతడికి కఠిన పరిస్థితులను కల్పిస్తాడు”.
[ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 1940]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైనా హాని కలుగ జేయరాదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ముస్లిం, తన తోటి సహోదర ముస్లింనకు. అతనికి సంబంధించిన ఏ విషయములోనైనా సరే, అతనికి హాని కలుగజేయరాదు. ఉదాహరణకు అతనికి వ్యక్తిగతంగా గానీ, అతని సంపదలో గానీ లేదా అతకి కుటుంబానికి గానీ హాని కలుగజేయరాదు. ఒకవేళ ఎవరైనా అలా చేసినట్లయితే, అల్లాహ్ వారి ఆచరణను బట్టి వారికి తగిన ప్రతిఫలాన్నిస్తాడు (శిక్షిస్తాడు).