+ -

عن تميم الداري رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال:
«الدِّينُ النَّصِيحَةُ» قُلْنَا: لِمَنْ؟ قَالَ: «لِلهِ وَلِكِتَابِهِ وَلِرَسُولِهِ وَلِأَئِمَّةِ الْمُسْلِمِينَ وَعَامَّتِهِمْ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 55]
المزيــد ...

తమీమ్ అద్'దారీ రజియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు:
“ధర్మము ఒక నిష్కల్మషమైన బోధన, ఉపదేశం”. మేము ఇలా అడిగాము: “ఎవరి కొరకు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ కొరకు, ఆయన గ్రంథం (ఖుర్’ఆన్) కొరకు, ఆయన సందేశహరుని కొరకు, ముస్లిముల విద్వాంసుల కొరకు మరియు సాధారణ ముస్లిములందరి కొరకు” అన్నారు.

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 55]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేసారు – ధర్మము నిష్కల్మషత్వము మరియు నిజాయితీలపై ఆధారపడి ఉంటుంది; అల్లాహ్ ఆదేశించిన విధంగా, సంపూర్ణంగా అచరించబడుటకు గాను, అందులో ఎటువంటి తగ్గింపు, నిర్లక్ష్యము, మోసము, వంచనలకు పాల్బడకుండా ఉండాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వారు ఇలా అడిగారు “ఈ ఉపదేశం ఎవరి కొరకు ఇవ్వబడింది?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు:
మొదటిది: ఈ ఉపదేశం పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ కొరకు ఇవ్వబడింది. ఆయన కొరకు ఆచరించే ఆచరణలలో నిజాయితీ, నిష్కల్మషత్వము ఉండాలి; ఎవరినీ, దేనినీ ఆయనకు సాటి కల్పించకుండా ఉండాలి, ఆయన ప్రభుతను (రుబూబియ్యత్ – కేవలం ఆయనే సర్వసృష్టికి ప్రభువు అనే విషయాన్ని) విశ్వసించాలి, కేవలం ఆయన మాత్రమే ఏకైక ఆరాధ్యుడు అనే విషయాన్ని(ఉలూహియ్యత్) విశ్వసించాలి, మరియు ఆయన యొక్క శుభ నామములను, ఆయన యొక్క గుణగణాలలో కేవలం ఆయన మాత్రమే ఏకైకుడు (అస్మా వస్సిఫాత్) అనే విషయాన్ని విశ్వసించాలి, ఆయన ఆదేశాలను శిరసావహించాలి మరియు ఆయనను విశ్వసించుట వైపునకు ప్రజలను ఆహ్వానించాలి.
రెండవది: ఆయన గ్రంథము కొరకు, అదే అల్ ఖుర్’ఆనుల్ కరీం. అది అల్లాహ్ యొక్క వాక్కు అని విశ్వసించాలి, ఖుర్’ఆన్ ఆయన అవతరింపజేసిన చిట్టచివరి దైవ గ్రంథము అని విశ్వసించాలి, తన కంటే ముందు ఉన్న షరియత్’లను అన్నింటినీ రద్దు చేయు గ్రంథమని విశ్వసించాలి, దాని ఔన్నత్యాన్ని గుర్తించాలి, గౌరవించాలి, మనం దానిని పారాయణం చేయవలసిన విధంగా పారాయణం చేయాలి. ఇంకా, ఖుర్’ఆన్ యొక్క ఆదేశాల ప్రకారం మనం ఆచరించాలి, అందులోని మన అవగాహనకు అందని, అస్పష్ట వాక్యాలను (విషయాలను) కూడా విశ్వసించాలి, దాని వ్యతిరేకులు చేసే కలుషిత వివరణలను అడ్డుకోవాలి, ఆ గ్రంథాన్ని వ్యాప్తి చేయుటను, అందునుండి ఉత్పన్నమయ్యే శాస్త్రాలను వ్యాపింపజేయుటను, మరియు ఖుర్’ఆన్ యొక్క సందేశం వైపునను ప్రజలను ఆహ్వానించుటను (బాధ్యతగా) స్వీకరించాలి.
మూడవది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల నిష్కల్మషముగా, నిజాయితీగా ఉండుట, అంటే, ప్రవక్తల పరంపరలో ఆయన చిట్టచివరి ప్రవక్త అని మనం విశ్వసించాలి. ఆయన తీసుకు వచ్చిన సందేశాన్ని విశ్వసించాలి, ఆయన ఆదేశాలను శిరసావహించాలి, ఆయన నిషేధించిన వాటినుండి దూరంగా ఉండాలి, కేవలం ఆయన తీసుకు వచ్చిన సందేశం ఆధారంగానే అల్లాహ్ ను ఆరాధించాలి, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన హక్కులను గౌరవించాలి, ఆయన పిలుపును విస్తరింపజేయాలి, ఆయన షరియత్’ను వ్యాపింపజేయాలి, ఆయన వ్యతిరేకులు ఆయనపై వ్యాపింపజేసే అపనిందలను ఖండించాలి, అడ్డుకోవాలి.
నాలుగవది: ముస్లిముల యొక్క ఇమాముల పట్ల నిజాయితీ (ఇమాం అంటే ఙ్ఞానవంతుడు అని, నాయకుడు అని అర్థాలున్నాయి): అంటే, సత్యముపై వారికి అన్ని విధాలా సహకరించాలి, సహాయము చేయాలి – వారు సత్యాన్ని అనుసరించేందుకు, దాని పరిరక్షణ కొరకు. అల్లాహ్’ను, ఆయన ఆదేశాలను అనుసరించే విషయాలలో వారి మాటలు వినాలి మరియు వారితో గొడవ పడరాదు.
ఐదవది: ముస్లిముల పట్ల నిష్కల్మషంగా, నిజాయితీగా ఉండాలి: అంటే మనం వారికి మంచి చేసే విషయంలో మరియు వారిని మంచి వైపునకు ఆహ్వానించే విషయంలో. అలాగే వారికి చెడు, కీడు, నష్టము తలపెట్టే విషయాలకు దూరంగా ఉండాలి. వారికి ఇష్టమైన దానిని మనం కూడా ఇష్టపడాలి, ధర్మనిష్ట, ధార్మికత, మరియు భక్తి, విశ్వాసము, మొదలైన విషయాలలో వారికి సహకరించాలి.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ الفولانية ఇటాలియన్ Урумӣ Канада الولوف البلغارية Озарӣ الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో సదుపదేశం, బోధన, సలహా ఇస్తూ ఉండాలనే ఆదేశం అందరి కొరకు ఉన్నది.
  2. సదుపదేశానికి ధర్మములో ఉత్తమ స్థానము ఉన్నది.
  3. ధర్మము – విశ్వాసాలు, ఉపదేశాలు, ఆదేశాలు మరియు ఆచరణలతో కూడినదై ఉంటుంది.
  4. ఇందులో, ఎవరికైతే సందేశం ఇవ్వబడుతున్నదో, మోసానికి పాల్బడ రాదనే సందేశము, స్వీయ ఆత్మ పరిశీలన, పరిశుధ్ధత కొరకు సందేశము మరియు అందరికీ మంచి చేయాలనే సంకల్పము ఉండాలి అనే సందేశము ఉన్నాయి.
  5. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అమోఘమైన బోధన విధానం మనకు కనిపిస్తుంది. ఏదైనా విషయాన్ని ముందుగా వారు సంక్షిప్తంగా పేర్కొంటారు. తరువాత దానిలోని ప్రతి అంశాన్ని వివరంగా విశదీకరిస్తారు.
  6. విషయాలను వాటి ప్రాథామ్యక్రమంలో ఉంచుట (ముఖ్య విషయాలెప్పుడూ, ముఖ్యమైనవిగానే ఉంటాయి): ఇందులో మనకు ముందుగా ఈ ఉపదేశం పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ కొరకు ఇవ్వబడింది అని పేర్కొన్నారు. తరువాత అల్లాహ్ గ్రంథానికి, తరువాత ఆయన సందేశహరునికి, తరువాత ముస్లిముల ఇమాముల కొరకు చివరగా సాధారణ ముస్లిములందరి కొరకు అని పేర్కొన్నారు.
ఇంకా