عَن عُمَرَ بنِ الخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ قال: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لَا تُطْرُونِي كَمَا أَطْرَتِ النَّصَارَى ابْنَ مَرْيَمَ؛ فَإِنَّمَا أَنَا عَبْدُهُ، فَقُولُوا: عَبْدُ اللهِ وَرَسُولُهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3445]
المزيــد ...
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను:
“మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ను క్రైస్తవులు (హద్దుమీరి) కీర్తించిన విధంగా, నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడను. కనుక నన్ను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనండి.
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 3445]
ఈ హదీసులో: క్రైస్తవులు ఈసా ఇబ్నె మరియం అలైహిస్సలాం విషయంలో ఏ విధంగానైతే మితిమీరినారో, ఆ విధంగా – షరియత్ విధించిన పరిమితులు అతిక్రమించి, అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆయన గుణగణాలతో, ఆయన కార్యాలతో, ఆయన అగోచర ఙ్ఞానంతో సమానంగా లేదా ఆయనను వేడుకునే విషయంలో సమానంగా – (హద్దులు దాటి) తనను కీర్తించడాన్ని, తన గుణగణాలను అతి చేసి ప్రశంసించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధిస్తున్నారు. ఇంకా తాను అల్లాహ్ యొక్క దాసులలో ఒక దాసుడను అని స్పష్టం చేస్తున్నారు. అందుకని తనను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనమని మనల్ని ఆదేశిస్తున్నారు.