عن عمران بن حصين رضي الله عنه قال: كَانَتْ بِي بَوَاسِيرُ، فَسَأَلْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الصَّلَاةِ، فَقَالَ:
«صَلِّ قَائِمًا، فَإِنْ لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا، فَإِنْ لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 1117]
المزيــد ...
ఇమ్రాన్ బిన్ హుస్సైన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను మొలల వ్యాధితో బాధపడుతున్నాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను నా నమాజు గురించి ప్రశ్నించాను. దానికి వారు ఇలా అన్నారు.”
“నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”.
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 1117]
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: శక్తి, సమర్థత లేని పరిస్థిలో తప్ప, నమాజుకు సంబంధించి ప్రాథమిక నియమం ఏమిటంటే నిలబడి నమాజును ఆచరించడం. నిలబడే శక్తి, సమర్థత లేని పరిస్థితిలో అతడు కూర్చుని ఆచరించాలి, ఒకవేళ అతడు కూర్చుని కూడా ఆచరించలేకపోతే అపుడు ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించాలి.