عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ رضي الله عنه:
أَنَّ رَسُولَ صَلَّى عَلَيْهِ وَسَلَّمَ أَخَذَ بِيَدِهِ، وَقَالَ: «يَا مُعَاذُ، وَاللَّهِ إِنِّي لَأُحِبُّكَ»، فَقَالَ: «أُوصِيكَ يَا مُعَاذُ لَا تَدَعَنَّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ تَقُولُ: اللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِكَ».
[صحيح] - [رواه أبو داود والنسائي وأحمد] - [سنن أبي داود: 1522]
المزيــد ...
ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
“రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి చేతిని పట్టుకుని ఇలా అన్నారు: “ఓ ము’ఆద్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)
[దృఢమైనది] - - [سنن أبي داود - 1522]
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ము’ఆద్ (రదియల్లాహు అన్హు) చేతిని పట్టుకుని “అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను, ప్రతి సలాహ్ తరువాత ఈ పదాలు పలుకకుండా ఎప్పుడూ ఉండవద్దు: (అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక) ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి – నీ విధేయతకు దగ్గర చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలో (నాకు సహాయం చేయి) (వ షుక్రిక) నీకు కృతఙ్ఞతలు అర్పించుకొనుటకు నాకు సహాయం చేయి – శుభాలు పొందడం మరియు విపత్తులను త్రిప్పికొట్టడం ద్వారా (కృతఙ్ఞతలు అర్పించుకొనుటకు నాకు సహాయం చేయి), (వ హుస్ని ఇబాదతిక్) నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి - అల్లాహ్ పట్ల చిత్తశుద్ధితో ఉండడం ద్వారా మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించడం ద్వారా (ఉత్తమంగా ఆరాధించుటకు సహాయం చేయి).