عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا سَمِعْتُمُ النِّدَاءَ، فَقُولُوا مِثْلَ مَا يَقُولُ المُؤَذِّنُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 611]
المزيــد ...
అబీ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“నమాజు కొరకు (ముఅజ్జిన్ యొక్క) అజాన్ పిలుపు విన్నపుడు, మీరు కూడా ముఅజ్జిన్ మాదిరిగానే పలకండి”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 611]
ఈ హదీసులో – నమాజు కొరకు ముఅజ్జిన్ ఇస్తున్న పిలుపు (అజాన్) వింటున్నపుడు, ఆయన ఏ పదాలనైతే పలుకుతున్నాడో, అవే పదాలు పలుకుతూ అతనికి ప్రత్యుత్తరమివ్వమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనలను ప్రోత్సహిస్తున్నారు. ముఅజ్జిన్ “అల్లాహు అక్బర్” అని పలికితే, తరువాత వెంటనే మనం కూడా “అల్లాహు అక్బర్” అంటాము, అతడు “షహాదతైన్” పలికితే, తరువాత వెంటనే మనం కూడా “షహాదతైన్” పలుకుతాము. అయితే “హయ్య అలస్సలాహ్ – హయ్య లల్ ఫలాహ్” అనే పదాలకు మాత్రం వేరే మినహాయింపు ఉంది – ముఅజ్జిన్ ఆ పదాలు పలికినపుడు మనం “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాము.