عَنْ مُعَاذٍ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ:
كُنْتُ رِدْفَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى حِمَارٍ يُقَالُ لَهُ عُفَيْرٌ، فَقَالَ: «يَا مُعَاذُ، هَلْ تَدْرِي حَقَّ اللَّهِ عَلَى عِبَادِهِ، وَمَا حَقُّ العِبَادِ عَلَى اللَّهِ؟»، قُلْتُ: اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «فَإِنَّ حَقَّ اللَّهِ عَلَى العِبَادِ أَنْ يَعْبُدُوهُ وَلا يُشْرِكُوا بِهِ شَيْئًا، وَحَقَّ العِبَادِ عَلَى اللَّهِ أَنْ لا يُعَذِّبَ مَنْ لا يُشْرِكُ بِهِ شَيْئًا»، فَقُلْتُ: يَا رَسُولَ اللَّهِ أَفَلاَ أُبَشِّرُ بِهِ النَّاسَ؟ قَالَ: «لا تُبَشِّرْهُمْ، فَيَتَّكِلُوا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2856]
المزيــد ...
ము’ఆద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఒక గాడిద పై కూర్చుని ఉన్నాను. ఆ గాడిద పేరు ‘ఉఫెయిర్’. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు “ఓ ము’ఆద్! నీకు తెలుసా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటో, అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటో?” దానికి నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు.” అన్నారు. నేను “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఈ శుభ వార్తను ప్రజలకు వినిపించవచ్చా?” అని అడిగాను. ఆయన “వారికీ శుభవార్తను వినిపించకు. అలా చేస్తే, వారు కేవలం దీని పైనే ఆధారపడి పోతారు” అన్నారు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2856]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసులపై అల్లాహ్ యొక్కహక్కు మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కును గురించి వివరిస్తున్నారు. దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే వారు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఎవరినీ, దేనీనీ ఆయనకు సాటి కల్పించరాదు. మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే ఎవరైతే ‘అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు’ అని విశ్వసిస్తారో మరియు ఆయనకు ఎవరినీ సాటి కల్పించరో, అటువంటి వారిని అల్లాహ్ శిక్షించడు. అపుడు ము’ఆద్ రజియల్లాహు అన్హు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ శుభవార్తను ప్రజలకు వినిపించవద్దా. వారు (అల్లాహ్ యొక్క) ఈ అనుగ్రహం పట్ల ఆనంద పడతారు, సంతోషపడతారు” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలు కేవలం దీనిపైనే ఎక్కడ ఆధార పడతారోనని భయపడి, ఆయనను వారించారు.