عَنْ ابْنَ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِذَا رَأَيْتُمُوهُ فَصُومُوا، وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا، فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1900]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:
“దానిని (నెలవంకను) చూసిన తరువాత ఉపవాసాలు ప్రారంభించండి; మరియు (రమదాన్ మాసము చివర) దానిని చూసినపుడు ఉపవాసములు విరమించండి. మేఘావృతమై ఉండి, అది కనబడక పోతే, అపుడు దానిని గురించి అంచనా వేయండి (అంటే షఅబాన్ నెల ముఫ్ఫై దినములుగా పూర్తి చేయండి).
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1900]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమదాన్ నెల ఆరంభాన్ని గురించి మరియు దాని ముగింపు గురించిన చిహ్నాలను ఈ విధంగా వివరిస్తున్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “రమదాన్ మాసపు నెలవంకను చూసినపుడు ఉపవాసాలు ప్రారంభించండి, ఒకవేళ మీకూ మరియు నెలవంకకు మధ్య మబ్బులు అడ్డువచ్చి, అవి నెలవంకను కమ్మివేసి మీరు దానిని చూడలేకపోయినట్లైతే, షఅబాన్ మాసపు గడువును ముఫ్ఫై దినములుగా లెక్కించండి; మరియు షవ్వాల్ మాసపు నెలవంకను చూసినపుడు ఉపవాసములు విరమించండి; ఒకవేళ మీకూ మరియు నెలవంకకు మధ్య మబ్బులు అడ్డువచ్చి, అవి నెలవంకను కమ్మివేసి మీరు దానిని చూడలేకపోయినట్లైతే, రమదాన్ మాసపు గడువును ముఫ్ఫై దినములుగా లెక్కించండి.”