+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قال:
جَاءَ نَاسٌ مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَسَأَلُوهُ: إِنَّا نَجِدُ فِي أَنْفُسِنَا مَا يَتَعَاظَمُ أَحَدُنَا أَنْ يَتَكَلَّمَ بِهِ، قَالَ: «وَقَدْ وَجَدْتُمُوهُ؟» قَالُوا: نَعَمْ، قَالَ: «ذَاكَ صَرِيحُ الْإِيمَانِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 132]
المزيــد ...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలో కొందరు ఆయన వద్దకు వచ్చి ఇలా అన్నారు:(ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు.

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 132]

వివరణ

సహాబాలలో కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తమ హృదయాలలో తాము ఎదుర్కునే కొన్ని గంభీరమైన విషయాలను (ఆలోచనలను) గురించి ప్రస్తావించారు. వాటిలోని అసహ్యత, మరియు ఆ విషయాలపట్ల అయిష్టత, జుగుప్స వాటిని గురించి బహిరంగంగా మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేనటువంటివి అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఆ విషయాల పట్ల మీలో ఇటువంటి విఙ్ఞత కలగడం నిజానికి నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం. 'మీ హృదయాలలో షైతాను పడవేసే ఇటువంటి ఆలోచనల పట్ల మీలో జుగుప్స కలగడం, వాటిని మీరు పైకి చెప్పడానికి కూడా ఇష్టపడకపోవడం, వాటిని ఘోరమైన విషయాలుగా మీరు గుర్తించడం – షైతాను మీ హృదయాలపై ఎటువంటి నియంత్రణ పొందలేదు' అనడానికి నిదర్శనం. అలా కాకుండా ఆ విషయాలలో పడిపోయేవారు షైతానుకు వ్యతిరేకంగా ఎటువంటి రక్షణలేని వారు అని అర్థం.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада الولوف البلغارية Озарӣ اليونانية الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో నిర్మలమైన విశ్వాసం కలిగిన వారి విషయంలో షైతాను బలహీనుడు అని, అతడు కేవలం చెడువిషయాల ఆలోచనలను మాత్రమే రేకిత్తించగలడు అని (వాటిని ఆచరించమని బలవంత పెట్టలేడని) అర్థమవుతున్నది.
  2. మనసులో రేగే పరిపరి విధాల చెడు ఆలోచనలను నిరాకరించకపోవడం, వాటిని ఆమోదించుకోవడం అనేది బలహీనమైన విశ్వాసానికి నిదర్శనం. పరిపరి విధాల చెడు ఆలోచనలు రేకెత్తించడం షైతాను యొక్క పని.
  3. ఒక విశ్వాసిని షైతాను కలుగజేసే పరిపరి విధాల చెడు ఆలోచనలు ఏమీ చేయలేవు. అయితే అతడు అటువంటి ఆలోచనలు కలిగినపుడు షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, ఆ ఆలోచనలలో దూరం వెళ్ళిపోకుండా తనను తాను అదుపు చేసుకోవాలి.
  4. ఈ హదీసులో, తన ధర్మానికి సంబంధించి ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే ఒక ముస్లిం మౌనంగా ఉండరాదని, వాటి గురించి (జ్ఞానం గలవారిని) ప్రశ్నించి, తెలుసుకోవాలి అనే సందేశం ఉన్నది.
ఇంకా