+ -

عن أبي هريرة رضي الله عنه قال:
لَعَنَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ الرَّاشِيَ وَالْمُرْتَشِيَ فِي الْحُكْمِ.

[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 1336]
المزيــد ...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక తీర్పును ప్రభావితం చేసేందుకు లంచం ఇచ్చే వానిని మరియు లంచం పుచ్చుకునే వానిని – ఇద్దరినీ శపించినారు.”

[దృఢమైనది] - - [سنن الترمذي - 1336]

వివరణ

ఈ హదీసులో – లంచము ఇచ్చే వాడు, మరియు లంచము పుచ్చుకునే వాడు – ఇద్దరూ - సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క కరుణనుండి, దూరమగు గాక అని శపించినారు.
ఇందులో న్యాయమూర్తులకు ఇచ్చే లంచము కూడా ఉన్నది. తనకు హక్కు లేని విషయములో తన పక్షమున తీర్పు ఇచ్చేలా చేయుటకు అతడు లంచము ఇస్తాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада الولوف Озарӣ الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. లంచము ఇచ్చుట, లంచము పుచ్చుకొనుట, లంచము విషయములో మధ్యవర్తిత్వము చేయుట, లేక సహాయము చేయుట మొదలైనవన్నీ కూడా నిషేధము. కారణం – అది అసత్యానికి సహకరించిన దానికి సమానము.
  2. లంచము అనేది ఘోరమైన పాపములలో (కబాఇర్ లలో) ఒకటి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లంచము ఇచ్చు వానిని, లంచము పుచ్చుకొను వానిని – ఇద్దరినీ శపించినారు.
  3. న్యాయవ్యవస్థలో లంచము అనేది అతి పెద్ద నేరము, మరియు అత్యంత ఘోరమైన పాపము. కారణము, దానివల్ల అన్యాయము జరుగుతుంది, మరియు అల్లాహ్ అవతరింప జేసిన చట్టము ద్వారా కాక ఇతర విషయముల (అసత్యాల) ఆధారంగా తీర్పు ఉంటుంది.
ఇంకా