«يُسَلِّمُ الرَّاكِبُ عَلَى المَاشِي، وَالمَاشِي عَلَى القَاعِدِ، وَالقَلِيلُ عَلَى الكَثِيرِ». وَلِلبُخَارِي: «يُسَلِّمُ الصَّغِيرُ عَلَى الكَبِيرِ، وَالمَارُّ عَلَى القَاعِدِ، وَالقَلِيلُ عَلَى الكَثِيرِ». المزيد
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.” సహీహ్ బుఖారీలో: “చిన్న వారు (వయసులో) పెద్దవారికి; పాదచారుడు కూర్చుని ఉన్న వానికి, చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలి” అని నమోదు చేయబడి ఉన్నది.