+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«كُلُّ أُمَّتِي مُعَافًى إِلَّا المُجَاهِرِينَ، وَإِنَّ مِنَ المُجَاهَرَةِ أَنْ يَعْمَلَ الرَّجُلُ بِاللَّيْلِ عَمَلًا، ثُمَّ يُصْبِحَ وَقَدْ سَتَرَهُ اللَّهُ عَلَيْهِ، فَيَقُولَ: يَا فُلاَنُ، عَمِلْتُ البَارِحَةَ كَذَا وَكَذَا، وَقَدْ بَاتَ يَسْتُرُهُ رَبُّهُ، وَيُصْبِحُ يَكْشِفُ سِتْرَ اللَّهِ عَنْهُ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6069]
المزيــد ...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప. బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడుటలో ఇది కూడా ఒక రకం – అందులో ఒకడు రాత్రివేళ పాపకార్యానికి ఒడిగడతాడు; ఉదయానికి అల్లాహ్ అతని పాపకార్యాన్ని (లోకులనుండి) కప్పివేస్తాడు; కానీ అతడు: “ఓ ఫలానా! ఓ ఫలానా! (నీకు తెలుసా) నేను రాత్రి ఇలా ఇలా చేసాను” అంటాడు (అలా అని దానిని బహిరంగ పరుస్తాడు). రాత్రి అతడు అల్లాహ్ యొక్క పరదా మాటున గడిపినప్పటికీ, ఉదయం అతడు తనంతట తానే ఆ పరదాను తొలగిస్తాడు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6069]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా విశదపరుస్తున్నారు: పాప కార్యాలకు పాల్బడిన ఒక ముస్లిం కొరకు అల్లాహ్ చేత అతని పాపములు క్షమించబడుటకు, అతనికి అల్లాహ్ చేత క్షమాభిక్ష ప్రసాదించబడుటకు అవకాశం ఉన్నది; కేవలం చేసిన పాపాన్ని గర్వంగా, డంబాలు పలుకుతూ, మూఢంగా జనుల ముందు బయల్పరిచే వాడు తప్ప. అటువంటి వాడు క్షమాభిక్షకు పాత్రుడు కాడు; ఎందుకంటే రాత్రివేళ అతడు పాపకార్యానికి ఒడిగడతాడు, అపుడు అల్లాహ్ అతడి పాపాన్ని (లోకుల నుండి) కప్పివేసి ఉంచినప్పటికీ; ఉదయం అతడు తాను క్రితం రాత్రి ఇలా ఇలా చేసాను అని చెబుతాడు. రాత్రి అతడు తన ప్రభువు పరదా మాటున గడుపుతాడు, కానీ ఉదయం అతడు స్వయంగా ఆ పరదాను తొలగించి తనను తాను బహిరంగ పరుచుకుంటాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية Малагашӣ Урумӣ Канада
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. చేసిన పాపాన్ని అల్లాహ్ కప్పి ఉంచిన తరువాత, దానిని బహిరంగపరచడం అసహ్యమైన పని.
  2. చేసిన పాపపు పనిని బహిరంగంగా చెప్పుకోవడం, విశ్వాసులలో నైతిక పతనాన్ని వ్యాపింపజేస్తుంది.
  3. ఎవరినైతే అల్లాహ్ ఈ ప్రపంచములో (తన పరదా వెనుక) కప్పి ఉంచుతాడో, అల్లాహ్ పరలోకమునందు కూడా (అతడి పాపములను) కప్పి ఉంచుతాడు. ఇది తన దాసుల పట్ల సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క నిరుపమానమైన కరుణ.
  4. ఎవరైతే పాపపు పనికి ఒడిగడతాడో, అతడు తనను తాను (బహిరంగ పరచకుండా) కప్పి ఉంచుకోవాలి మరియు పాపపు పనికి పాల్బడినందుకు అల్లాహ్ సమక్షమున పశ్చాత్తాపము చెందాలి.
  5. చేసిన పాపపు కార్యాన్ని ఉద్దేశ్యపూర్వకంగా బహిరంగంగా ప్రకటించుకునే వాని భయంకరమైన అపరాధం ఏమిటంటే – ఆ కారణంగా అతడు అల్లాహ్ చేత క్షమించబడే అవకాశాన్ని కోల్పోతాడు.
ఇంకా