عن أبي موسى الأشعري رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «لا نِكاح إلا بِوَلِيّ».
[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه والدارمي وأحمد]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు కథనం –మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు:వలీ'వధువు యొక్క సంరక్షకుడు లేని వివాహము చెల్లదు
దృఢమైనది - దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసు నికాహ్ ఒప్పందంలో వలీ కు గల పాత్రను ఖచ్చితమని సూచిస్తుంది ఎందుకంటే అతను నికాహ్ పరిపూర్ణమవ్వడానికి కావలిసిన ముఖ్యమైన షరతుల్లో ఒకడు,అతను లేకుండా నికాహ్ చెల్లదు,రద్దు అవుతుంది,వలీ-సంరక్షకుడికి వర్తించే షరతులు ఇవి: పర్యవేక్షణ,పురుషుడు మరియు నికాహ్ ప్రయోజనాలు తెలిసిన వివేకి అయి ఉండటం,వలీ మరియు వరుడి ధర్మం ఒకటై ఉండాలి,నికాహ్ ఒప్పందంలో ఈ గుణాలు లేని వ్యక్తి వలీ’అర్హతకు అనర్హుడిగా పరిగణించబడతాడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. సంరక్షకుడి హాజరు వివాహం చెల్లుబాటులో ఒక ఖచ్చితమైన షరతు.
  2. (వలీ)సంరక్షకుడు అంటే పురుషుల్లో స్త్రీకి అత్యంత సన్నిహితుడు,సన్నిహిత వలీ ఉన్నప్పుడూ దూరపు వలీ ఆమెకు నికాహ్ చేయలేడు.
  3. వలీ లేకుండా నికాహ్ చెల్లదు,అలాంటి నికాహ్ షరీఅతుకు వ్యతిరేకమైనది,కాబట్టి పాలకుడి వద్ద ఆ నికాహ్ ను రద్దు చేయడమో లేక షరీఅతు ప్రకారమైన తలాఖ్ తీసుకోవాలి.
  4. ఒక మహిళకు తన బందు మిత్రులలో సన్నిహిత వలీ లేనప్పుడు ఆమెకు ఇమామ్ లేక నాయిబ్ ఇమామ్ వలీ గా మారుతాడు,వలీ సంరక్షకుడు లేనివాడికి చక్రవర్తియే సంరక్షకుడు వలీ.అవుతాడు.
  5. ఖచ్చితంగా వలీ అనువాడు వివేకవంతుడై ఉండాలి,ఎందుకంటే మహిళకు చెందిన ప్రయోజనాలు పూర్తి కావడానికి అతను వివేకవంతుడు అయినప్పుడే సాధ్యమవుతుంది.
ఇంకా