عن ابن عباس رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم:
«ما مِنْ أيَّامٍ العمَلُ الصَّالِحُ فيها أحبُّ إلى اللهِ مِن هذه الأيام» يعني أيامَ العشر، قالوا: يا رسُولَ الله، ولا الجهادُ في سبيلِ الله؟ قال: «ولا الجهادُ في سبيلِ الله، إلا رجلٌ خَرَجَ بنفسِه ومالِه فلم يَرْجِعْ من ذلك بشيءٍ».
[صحيح] - [رواه البخاري وأبو داود، واللفظ له] - [سنن أبي داود: 2438]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా పలికినారు:
“ఈ దినములలో చేసే సత్కార్యాలు (అంటే జిల్ హిజ్జహ్ నెల మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు) మిగతా ఏ దినములలో చేసే సత్కార్యాల కన్నా కూడా అల్లాహ్’కు అత్యంత ప్రియమైనవి.” (వింటున్న) వారు ఇలా ప్రశ్నించినారు: “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కంటే కూడా గొప్పవా?” దానికి ఆయన “అవును, అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కూడా (ఈ పది దినములలో చేసే సత్కార్యాల కన్నా) గొప్పది కాదు; అయితే తన ప్రాణాన్ని, తన సంపదను వెంట తీసుకుని జిహాదు కొరకు వెళ్ళి, ఆ రెండింటిలో ఏ ఒక్క దానితోనూ వెనుకకు తిరిగి రాని వాని జిహాదు తప్ప” అన్నారు.
[దృఢమైనది] - - [سنن أبي داود - 2438]
ఈ హదీసులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - జిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు, సంవత్సరములోని మిగతా దినాలలో చేసే సత్కార్యాలకన్నా కూడా ఉత్తమమైనవి అని తెలియజేస్తున్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు ఆయనను ఈ పది దినములలో కాక మిగతా దినములలో చేసే జిహాదును గురించి ప్రశ్నించడం జరిగింది – మిగతా దినములలో చేసే జిహాదు ఉత్తమైనదా, లేక ఈ పది దినములలో చేసే సత్కార్యాలు ఉత్తమమైనవా అని; నిజానికి, (దీనికి పూర్వమే) వారికి జిహాదు అత్యుత్తమమైన ఆచరణలలో ఒకటి అని పలుమార్లు (నిర్ధారణగా) బోధించడం జరిగింది.
అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విధంగా జవాబు ఇచ్చినారు: “ఈ పది దినములలో చేసే సత్కార్యాలు, మిగతా దినములలో చేసే జిహాదు కన్నా కూడా ఉత్తమమైనవి – అయితే, (మిగతా దినములలో చేసే జిహాదులో) కేవలం అల్లహ్ కొరకు తన ప్రాణాన్ని, తన ధనాన్ని పణంగా పెట్టి జిహాదులో పాల్గొని, తన ధనాన్ని కోల్పోయి (జిహాదు కొరకు తన ధనాన్ని ఆసాంతం అల్లాహ్ కొరకు ఖర్చు చేసి), తన ప్రాణాన్ని కూడా అల్లాహ్ మార్గములో ధారపోసిన వాని జిహాదు తప్ప.” ఈ పది దినములలో సత్కార్యాలు చేసే వాడు అంత గొప్ప ప్రతిఫలాన్ని పొందే వాడై ఉంటాడు.