عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قال: قال رَسُولُ الله صلى الله عليه وسلم:
«إِنَّ اللهَ يَغَارُ، وَإِنَّ الْمُؤْمِنَ يَغَارُ، وَغَيْرَةُ اللهِ أَنْ يَأْتِيَ الْمُؤْمِنُ مَا حَرَّمَ عَلَيْهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2761]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్బడుట (అనగా అల్లాహ్ యొక్క అభిమానము భంగపడినట్లు).”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2761]
ఈ హదీసు లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, ఆయన కొన్ని విషయాలను అసహ్యించుకుంటాడు, కొన్ని విషయాలను అయిష్టపడతాడు; అలాగే విశ్వాసి కూడా అభిమానవంతుడు, అతడూ కొన్ని విషయాలను అసహ్యించుకుంటాడు, కొన్ని విషయాలను అయిష్టపడతాడు. అల్లాహ్ యొక్క అభిమానము ఎప్పుడు భంగపడుతుందంటే, విశ్వాసి అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్బడినప్పుడు, ఉదాహరణకు: వ్యభిచారము, స్వలింగ సంపర్కము, దొంగతనము, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు సేవించడం, ఇంకా అటువంటి అనైతిక కార్యాలకు పాల్బడుట.