عَنْ حُذَيْفَةَ رضي الله عنه قَالَ:
كُنْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَانْتَهَى إِلَى سُبَاطَةِ قَوْمٍ، فَبَالَ قَائِمًا، فَتَنَحَّيْتُ فَقَالَ: «ادْنُهْ» فَدَنَوْتُ حَتَّى قُمْتُ عِنْدَ عَقِبَيْهِ فَتَوَضَّأَ فَمَسَحَ عَلَى خُفَّيْهِ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 273]
المزيــد ...
హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“(ఒకసారి) నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. (దారిలో) ఆయన ఒక తెగవారు తమ చెత్తాచెదారం వేసే స్థలం వద్దకు వచ్చారు. అక్కడ ఆయన నిలబడి మూత్ర విసర్జన చేసారు, నేను ఒక ప్రక్కకు వెళ్ళిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను దగ్గరికి రమ్మని పిలిచినారు. నేను ఆయన మడమల వెనుక భాగాన నిలబడేటంత దగ్గరగా వెళ్ళాను. తరువాత ఆయన వుజూ చేసి, తన కాళ్ళకు తొడిగుకుని ఉన్న మేజోళ్ళపై (సాక్సులపై) మసహ్ చేసినారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 273]
హుజైఫహ్ ఇబ్నె అల్ యమాన్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖిస్తున్నారు – ఒకసారి తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నానని, వారు మూత్రవిసర్జన చేయాలని తలంచి, ఒక తెగ వారి పెరడు భూమిలోని ప్రవేశించినారు. అక్కడ ఆ తెగవారు తమ ఇళ్ళను ఊడ్చిన చెత్త, దుమ్ము ధూళి తదితర చెత్తా చెదారం పడవేస్తారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – సాధారణంగా ఎపుడూ కూర్చుని మూత్రవిసర్జన చేసే వారు అయినప్పటికీ – నిలబడి మూత్రవిసర్జన చేసినారని ఉల్లేఖించినారు.
హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఆయన నుండి దూరంగా జరిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో: “దగ్గరికి రా” అన్నారు. అపుడు హుజైఫహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మడమల వెనుక, ఆ స్థితిలో ఆయన కబడకుండా ఒక తెరలాగ నిలబడినారు.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసినారు. కాళ్ళు కడగవలసి వచ్చినపుడు ఆయన తన కాళ్ళకు తొడుగుకుని ఉన్న మేజోళ్ళపై (సాక్సులపై) మసహ్ చేసి సరిపెట్టినారు. అవి మడమలను కప్పి ఉంచేలా, పలుచని తోలు లేదా అటువంటి దానితో తయారు చేయబడి, కాళ్ళకు తొడుగుకునే మేజోళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని తన కాళ్ళ నుండి తొలగించలేదు.