«مَثَلُ الْمُنَافِقِ، كَمَثَلِ الشَّاةِ الْعَائِرَةِ بَيْنَ الْغَنَمَيْنِ تَعِيرُ إِلَى هَذِهِ مَرَّةً وَإِلَى هَذِهِ مَرَّةً».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2784]
المزيــد ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారని అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖిస్తున్నారు:
“కపట విశ్వాసి ఉపమానము రెండు గుంపుల మధ్య తిరుగుతూ ఉండే ఆడ గొర్రె ఉపమానము వంటిది. అది ఒకసారి ఈ గుంపు లోనికి వెళితే, ఒకసారి ఆ గుంపు లోనికి వెళుతుంది”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2784]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక కపట విశ్వాసి స్థితిని గురించి వివరిస్తున్నారు. కపట విశ్వాసి స్థితి, తటపటాయింపుకు, సంశయానికీ లోనైన ఒక ఆడ గొర్రె వంటిది. గొర్రెల రెండు సమూహాలు ఉంటే, ఏ సమూహాన్ని అనుసరించాలో తెలియని స్థితిలో అది అటూఇటూ తచ్చాడుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉంటే నీవు ఒకసారి ఈ సమూహము లోనికి వెళతావు, మరోసారి ఆ సమూహము లోనికి వెళతావు. కనుక కపట విశ్వాసులు విశ్వాసానికీ అవిశ్వాసానికి మధ్య నిర్ణయించుకోలేని డోలాయమాన స్థితిలో పడి ఉంటారు. కనుక వారు బాహ్యంగానూ మరియు అంతరంగంగానూ (సంపూర్ణంగా) విశ్వాసులతోనూ ఉండరు, అలాగే వారు బాహ్యంగానూ మరియు అంతరంగంగానూ (సంపూర్ణంగా) అవిశ్వాసులతోనూ ఉండరు. నిజానికి వారు బాహ్యంగా (వేషభూషణాలు ధరించి) విశ్వాసులతోనూ, మరియు అంతరంగాలలో అనుమానాలు, సందేహాలతో, తటపటాయింపుల సంశయాలతో అవిశ్వాసులతో కలిసి ఉంటారు. కనుక కొన్ని సమయాలలో వారు విశ్వాసులతో ఉంటారు, మరి కొన్ని సమయాలలో వారు అవిశ్వాసులతో ఉంటారు.