«كُلُّكُمْ رَاعٍ فَمَسْئُولٌ عَنْ رَعِيَّتِهِ، فَالأَمِيرُ الَّذِي عَلَى النَّاسِ رَاعٍ وَهُوَ مَسْئُولٌ عَنْهُمْ، وَالرَّجُلُ رَاعٍ عَلَى أَهْلِ بَيْتِهِ وَهُوَ مَسْئُولٌ عَنْهُمْ، وَالمَرْأَةُ رَاعِيَةٌ عَلَى بَيْتِ بَعْلِهَا وَوَلَدِهِ وَهِيَ مَسْئُولَةٌ عَنْهُمْ، وَالعَبْدُ رَاعٍ عَلَى مَالِ سَيِّدِهِ وَهُوَ مَسْئُولٌ عَنْهُ، أَلاَ فَكُلُّكُمْ رَاعٍ وَكُلُّكُمْ مَسْئُولٌ عَنْ رَعِيَّتِهِ». المزيد
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు; ప్రజలపై పాలకునిగా ఉన్న వ్యక్తి సంరక్షకుడు, అతడు వారికి బాధ్యత వహిస్తాడు; మనిషి తన ఇంటిలో ఉన్న వారందరిపై సంరక్షకుడు మరియు అతడు వారికి బాధ్యత వహిస్తాడు; స్త్రీ తన భర్త ఇంటికి మరియు అతని పిల్లలకు సంరక్షకురాలు మరియు వారికి బాధ్యత వహిస్తుంది; దాసుడు తన యజమాని ఆస్తికి సంరక్షకుడు మరియు దానికి బాధ్యత వహిస్తాడు. మీలో ప్రతి ఒక్కరు సంరక్షకులు, మరియు మీలో ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యులు.”