إِنِّي أُسْتَحَاضُ فَلاَ أَطْهُرُ، أَفَأَدَعُ الصَّلاَةَ؟ فَقَالَ: «لَا، إِنَّ ذَلِكِ عِرْقٌ، وَلَكِنْ دَعِي الصَّلاَةَ قَدْرَ الأَيَّامِ الَّتِي كُنْتِ تَحِيضِينَ فِيهَا، ثُمَّ اغْتَسِلِي وَصَلِّي». المزيد
ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
“ఫాతిమా బింత్ అబీ హుబైష్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించారు:
“(ఓ ప్రవక్తా!) బహిష్ఠు కారణంగా (బహిష్ఠు దినములు గడిచిపోయిన తరువాత కూడా) నాకు నిరంతరం రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగా నేను పరిశుద్ధత పొందలేకపోతున్నాను. నేను సలాహ్ కు (నమాజుకు) దూరంగా ఉండాలా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు “లేదు (నీవు సలాహ్ కు దూరంగా ఉండవలసిన అవసరం లేదు); అది ఒక రక్తనాళము. సాధారణంగా బహిష్ఠు ఎన్ని దినముల కొరకు ఉంటుందో అన్ని దినములు సలాహ్ కు దూరంగా ఉండు. ఆ తరువాత గుసుల్ చేసి నమాజులను ఆచరించు.”