عَنْ مَالِكِ بْنِ أَوْسِ بْنِ الْحَدَثَانِ أَنَّهُ قَالَ: أَقْبَلْتُ أَقُولُ مَنْ يَصْطَرِفُ الدَّرَاهِمَ؟ فَقَالَ طَلْحَةُ بْنُ عُبَيْدِ اللهِ وَهُوَ عِنْدَ عُمَرَ بْنِ الْخَطَّابِ رضي الله عنهما: أَرِنَا ذَهَبَكَ، ثُمَّ ائْتِنَا، إِذَا جَاءَ خَادِمُنَا، نُعْطِكَ وَرِقَكَ، فَقَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ: كَلَّا، وَاللهِ لَتُعْطِيَنَّهُ وَرِقَهُ، أَوْ لَتَرُدَّنَّ إِلَيْهِ ذَهَبَهُ، فَإِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الْوَرِقُ بِالذَّهَبِ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ، وَالْبُرُّ بِالْبُرِّ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ، وَالشَّعِيرُ بِالشَّعِيرِ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ، وَالتَّمْرُ بِالتَّمْرِ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ».
المزيد
మాలిక్ ఇబ్న్ ఔస్ ఇబ్న్ అల్-హదథాన్ ఉల్లేఖన: “(దీనార్లకు బదులుగా) దిర్హమ్’లను మార్పిడి చేసేవారు ఎవరైనా ఉన్నారా?” అంటూ నేను అక్కడ ప్రవేశించినాను. అక్కడ తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్, ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హుమా) ఉన్నారు. తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్ (ర) ఇలా అన్నారు: “ముందు నీవు తెచ్చిన బంగారాన్ని చూపించు, కొద్దిసేపటి తరువాత తిరిగిరా, అప్పుడు నా సేవకుడు నీకు వెండి నాణాలను ఇస్తాడు”. అది విని ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను) ఇది సరికాదు. నువ్వు ఇప్పుడే అతనికి వెండి నాణాలను ఇవ్వు, లేదా అతని బంగారం అతనికి తిరిగి ఇచ్చివేయి, ఎందుకంటే, నిశ్చయంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
“బంగారానికి బదులుగా వెండి అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; అలాగే గోధుమలకు బదులుగా గోధుమలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; బార్లీ గింజలకు బదులుగా బార్లీ గింజలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది.”