عَلَّمَنِي رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكَفِّي بَيْنَ كَفَّيْهِ، التَّشَهُّدَ، كَمَا يُعَلِّمُنِي السُّورَةَ مِنَ القُرْآنِ: «التَّحِيَّاتُ لِلَّهِ، وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلاَمُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلاَمُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ». وفي لفظ لهما: «إِنَّ اللهَ هُوَ السَّلَامُ، فَإِذَا قَعَدَ أَحَدُكُمْ فِي الصَّلَاةِ فَلْيَقُلْ: التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، فَإِذَا قَالَهَا أَصَابَتْ كُلَّ عَبْدٍ لِلَّهِ صَالِحٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، ثُمَّ يَتَخَيَّرُ مِنَ الْمَسْأَلَةِ مَا شَاءَ». المزيد
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నా చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ‘తషహ్హుద్’ ను నేర్పించినారు; “అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రమ్హతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్’హదు అన్’లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు”.
(కొన్ని హదీసులలో) కొన్ని పదాలున్నాయి వాటిలో “నిశ్చయంగా అల్లాహ్ – ఆయనే శాంతి ప్రదాత. కనుక నమాజులో ‘ఖాయిదా’ స్థితిలో మీరు ఇలా పలకండి “అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్”. ఒకవేళ మీరు అలా పలికినట్లయితే అది భూమ్యాకాశాలలో ఉన్న నీతిమంతులైన అల్లాహ్ దాసులందరికీ అది చేరుతుంది; (తరువాత ఈ పలుకులతో పూర్తి చేయండి) “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”; తరువాత దాసుడు తాను కోరిన ఏ దుఆనైనా ఎంచుకోవచ్చును.”