«لَيَبْلُغَنَّ هَذَا الأَمْرُ مَا بَلَغَ اللَّيْلُ وَالنَّهَارُ، وَلَا يَتْرُكُ اللهُ بَيْتَ مَدَرٍ وَلَا وَبَرٍ إِلَّا أَدْخَلَهُ اللهُ هَذَا الدِّينَ، بِعِزِّ عَزِيزٍ أَوْ بِذُلِّ ذَلِيلٍ، عِزًّا يُعِزُّ اللهُ بِهِ الإِسْلَامَ، وَذُلًّا يُذِلُّ اللهُ بِهِ الكُفْرَ» وَكَانَ تَمِيمٌ الدَّارِيُّ يَقُولُ: قَدْ عَرَفْتُ ذَلِكَ فِي أَهْلِ بَيْتِي، لَقَدْ أَصَابَ مَنْ أَسْلَمَ مِنْهُمُ الْخَيْرُ وَالشَّرَفُ وَالْعِزُّ، وَلَقَدْ أَصَابَ مَنْ كَانَ مِنْهُمْ كَافِرًا الذُّلُّ وَالصَّغَارُ وَالْجِزْيَةُ.
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 16957]
المزيــد ...
తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా నేను విన్నాను:
“రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడి వరకు చేరుకుంటాయో అక్కడి వరకు నిశ్చయంగా ఈ విషయం (ఇస్లాం) చేరుకుంటుంది. అది పల్లె గానీ లేదా పట్టణం గానీ లేదా ఎడారి గానీ, అల్లాహ్ ఏ ఒక్క ఇంటినీ విడిచి పెట్టకుండా ఈ ధర్మాన్ని (ఇస్లాంను) ప్రవేశింపజేస్తాడు; తద్వారా గౌరవనీయులకు గౌరవాన్ని ప్రసాదిస్తూ, అవమానకరమైన వారిని అవమానం పాలు చేస్తూ; ఇక్కడ గౌరవం అంటే ఇస్లాం ద్వారా కలుగజేయబడే గౌరవం; మరియు అవమానం అంటే అవిశ్వాసం ద్వారా కలుగజేయబడే అవమానం.” తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇలా అంటూ ఉండేవారు: “వాస్తవంలో నా కుటుంబ సభ్యులలోనే ఇలా జరగడం నాకు తెలుసు. వారిలో ఇస్లాం స్వీకరించిన వారికి వాస్తవంగా శుభాలు, గౌరవం మరియు కీర్తి లభించాయి; మరియు వారిలో ఎవరైతే సత్యతిరస్కారులై, అవిశ్వాసులుగా ఉండిపోయారో, వాస్తవములో వారు అధోగతి పాలై, అవమానం పాలై, ‘జిజియా’ చెల్లించే స్థితిలో ఉండిపోయారు.”
[ప్రామాణికమైన హదీథు] - [ఆహ్మద్ నమోదు చేసినారు:] - [ముస్నద్ అహ్మద్ - 16957]
ఈ హదీథులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా తెలియజేస్తున్నారు: భూమి యొక్క అన్ని ప్రాంతాలకు ఈ ధర్మం వ్యాపిస్తుంది, రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడికి చేరుకుంటాయో, ఈ ధర్మం అక్కడి వరకు చేరుకుంటుంది అని. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ధర్మాన్ని ప్రవేశపెట్టకుండా ఏ ఇంటినీ వదిలి పెట్టడు, పట్టణాలలో, గ్రామాలలో, ఎడారిలో లేదా అరణ్యంలో ఎక్కడైనా సరే. ఎవరైతే ఈ ధర్మాన్ని అంగీకరించి, స్వీకరిస్తారో, దానిని విశ్వసిస్తారో వారు (అల్లాహ్) ఇస్లాంకు ప్రసాదించే గౌరవంతో గౌరవించబడతారు, మరియు ఎవరైతే దానిని తిరస్కరిస్తారో, మరియు ఆ ధర్మాన్ని విశ్వసించరో, అలాంటి వారు అవమానానికి, పరాభవానికి గురిచేయబడతారు.
ఈ హదీసు ఉల్లేఖించిన సహాబీ తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలియజేసారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ప్రకటన నిజమవడాన్ని తాను చూశానని, ముఖ్యంగా తన కుటుంబ సభ్యులలో - ఎవరైతే ఇస్లాం స్వీకరించినాడో, అతడు మంచితనం, గౌరవం మరియు కీర్తిని పొందాడు, మరియు ఎవరైతే అవిశ్వాసిగానే మిగిలి పోయాడో, అతడు ముస్లింలకు జీజియాగా డబ్బు చెల్లించవలసి రావడంతో పాటు, అవమానానికి మరియు పరాభవానికి గురయ్యాడు.