1. ప్రధాన పేజీ
  2. వర్గీకరణలు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీథు రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«إِذَا جَاءَ رَمَضَانُ فُتِّحَتْ أَبْوَابُ الْجَنَّةِ، وَغُلِّقَتْ أَبْوَابُ النَّارِ، وَصُفِّدَتِ الشَّيَاطِينُ».

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు."

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 1079

వ్యాఖ్యానము

రమదాన్ నెల ప్రారంభమైనప్పుడు, మూడు విషయాలు జరుగుతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపినారు: మొదటిది: స్వర్గద్వారాలు తెరవబడతాయి మరియు వాటిలో ఏదీ మూసివేయబడదు. రెండవది: నరకద్వారాలు మూసివేయబడతాయి మరియు వాటిలో ఏదీ తెరవబడదు. మూడవది: షైతానులు మరియు దుష్ట జిన్నులు సంకెళ్లతో కట్టివేయబడతారు. అందువలన, రమదాన్ కాకుండా ఇతర నెలలలో వారు సాధించగలిగిన సాఫల్యాలు, ఈ నెలలో సాధించలేరు (అంటే ప్రజలను మార్గభ్రష్టత్వం వైపు ప్రేరేపించలేరు). ఇవన్నీ ఈ పవిత్రమైన నెల గొప్పదనాన్ని కీర్తించడానికీ, అలాగే నమాజ్, సదకా, జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మొదలైన పుణ్యకార్యాలు ఎక్కువగా చేసేలా, పాపాలు మరియు అవిధేయతలు నుండి దూరంగా ఉండేలా విశ్వాసులను ప్రోత్సహించడానికీను.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. రమదాను మాసం యొక్క ఘనత
  2. ఈ పుణ్యమైన రమదాన్ మాసం ఆరాధనల మరియు మంచి పనుల ఋతువు అని ఉపవాసం పాటించే వారికి శుభవార్త ఇవ్వబడింది.
  3. రమదాన్ నెలలో షైతానులను బంధించడం అనేది షైతానుల బంధంలో చిక్కుకున్నాననే వ్యక్తి యొక్క సాకు తొలగించబడిందని సూచిస్తుంది, అంటే అతనికి చెప్పినట్లుగా: షైతానులు నీ వద్దకు రాకుండా నిరోధించబడ్డాయి, కాబట్టి ఇక విధేయతను విడిచి పెట్టడానికి లేదా పాపం చేయడానికి వాటిని సాకుగా చూపించే అవకాశం నీకు లేదు.
  4. ఖుర్తుబి ఇలా అన్నారు: మరి, రమదాన్‌ నెలలో ఇన్ని చెడుపనులు మరియు పాపాలు జరుగుతూ ఉండడాన్ని మనం ఎలా చూస్తున్నాము? షైతానులను బంధించినట్లయితే, ఇలా జరగ కూడదు కదా? సమాధానం: ఉపవాసం పాటించేవారిలో చెడుపనులు, పాపాలు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఉపవాసం యొక్క షరతులు మరియు దాని మర్యాదలు పాటించబడతాయి. లేదా కొన్ని ఉల్లేఖనలలో చెప్పబడినట్లు, బంధించబడినవి కొన్ని దయ్యాలు, తిరుగుబాటుదారులు మాత్రమే, మొత్తం అన్నీ బంధించబడలేదు. లేదా ఉపవాస సమయంలో చెడులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఇలా చెప్పబడి ఉంటుంది. మరియు ఇది స్పష్టంగా అర్థం అవుతుంది, ఎందుకంటే ఉపవాస సమయంలో దాని సంభవం ఇతర సమయాల కంటే తక్కువగా ఉంటుంది. అవన్నీ బంధించబడినందున, ఎటువంటి చెడు లేదా పాపం జరిగే అవకాశం లేదు, ఎందుకంటే అలా చెడుపనులు జరగటానికి షైతానులే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి, దుష్ట ఆత్మలు, చెడు అలవాట్లు మరియు మానవులలోని దుష్టులు మొదలైనవి.

అనువాదాలను చూపించండి

43 భాష
EN English الإنجليزية
UR اردو الأوردية
ES Español الإسبانية
ID Indonesia الإندونيسية
BN বাংলা البنغالية
TR Türkçe التركية
RU Русский الروسية
BS Bosanski البوسنية
SI සිංහල السنهالية
HI हिन्दी الهندية
ZH 中文 الصينية
FA فارسی الفارسية
VI Tiếng Việt الفيتنامية
TL Tagalog تجالوج
KU Kurdî الكردية
HA Hausa الهوسا
PT Português البرتغالية
ML മലയാളം المليالم
SW Kiswahili السواحيلية
TA தமிழ் التاميلية
MY မြန်မာ البورمية
TH ไทย التايلندية
PS پښتو بشتو
AS অসমীয়া الأسامية
SQ Shqip الألبانية
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy المالاجاشية
KN ಕನ್ನಡ الكانادا
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية