1. ప్రధాన పేజీ
  2. వర్గీకరణలు

హదీథు “జామాఅత్” తో కలిసి ఆచరించిన వాని సలాహ్ (నమాజు) యొక్క స్థాయి, తన ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం మొ.) లోనో ఆచరించే వాని సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:

«صَلَاةُ الرَّجُلِ فِي جَمَاعَةٍ تَزِيدُ عَلَى صَلَاتِهِ فِي بَيْتِهِ وَصَلَاتِهِ فِي سُوقِهِ بِضْعًا وَعِشْرِينَ دَرَجَةً، وَذَلِكَ أَنَّ أَحَدَهُمْ إِذَا تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ، ثُمَّ أَتَى الْمَسْجِدَ لَا يَنْهَزُهُ إِلَّا الصَّلَاةُ، لَا يُرِيدُ إِلَّا الصَّلَاةَ، فَلَمْ يَخْطُ خَطْوَةً إِلَّا رُفِعَ لَهُ بِهَا دَرَجَةٌ، وَحُطَّ عَنْهُ بِهَا خَطِيئَةٌ، حَتَّى يَدْخُلَ الْمَسْجِدَ، فَإِذَا دَخَلَ الْمَسْجِدَ كَانَ فِي الصَّلَاةِ مَا كَانَتِ الصَّلَاةُ هِيَ تَحْبِسُهُ، وَالْمَلَائِكَةُ يُصَلُّونَ عَلَى أَحَدِكُمْ مَا دَامَ فِي مَجْلِسِهِ الَّذِي صَلَّى فِيهِ، يَقُولُونَ: اللهُمَّ ارْحَمْهُ، اللهُمَّ اغْفِرْ لَهُ، اللهُمَّ تُبْ عَلَيْهِ، مَا لَمْ يُؤْذِ فِيهِ، مَا لَمْ يُحْدِثْ فِيهِ».

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“జామాఅత్” తో కలిసి ఆచరించిన వాని సలాహ్ (నమాజు) యొక్క స్థాయి, తన ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం మొ.) లోనో ఆచరించే వాని సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది ఎందుకంటే అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా ఉదూ చేస్తాడు, తరువాత అతడు మస్జిద్ కు బయలుదేరుతాడు; అతడిని సలాహ్ తప్ప మరింకే విషయమూ అలా చేయడానికి ప్రోత్సహించదు; సలాహ్ ఆచరించడం తప్ప అతడు మరింకేదీ కోరుకోడు; (అటువంటి స్థితిలో) అతడు మస్జిదులోనికి ప్రవేశించేంత వరకు అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; అతడి నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది; మరి మస్జిదులోనికి ప్రవేశించిన తరువాత కేవలం సలాహ్ మాత్రమే అతడు మస్జిదులో వేచి ఉండేలా చేసినట్లయితే, అతడు వేచి ఉన్న సమయమంతా అతడు సలాహ్ లోనే ఉన్నట్లుగా భావించబడుతుంది; అటువంటి వాని కొరకు, అతడు సలాహ్ ఆచరించిన స్థానములోనే కూర్చుని ఉన్నంత వరకు, దైవదూతలు అల్లాహ్’ను ప్రార్థిస్తూ ఉంటారు – నీవు అక్కడ ఇతరులకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంత వరకు, లేదా నీ ఉదూ భంగం కానంత వరకు దైవదూతలు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు “ఓ అల్లాహ్ అతడిని కరుణించు, ఓ అల్లాహ్ అతడిని క్షమించు, ఓ అల్లాహ్ అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 649

వ్యాఖ్యానము

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక ముస్లిం జామాఅత్ తో పాటు సలాహ్ (నమాజు) ఆచరించినట్లయితే అది అతడు తాను ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం) లోనో ఆచరించిన సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది. తరువాత దాని కారణాన్ని ఇలా వివరిస్తున్నారు: అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా మరియు పరిపూర్ణంగా ఉదూ ఆచరిస్తాడు; తరువాత అతడు మస్జిదుకు బయలుదేరుతాడు – కేవలం సలాహ్ ఆచరించే సంకల్పముతో బయలు దేరుతాడు; దానితో అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; ప్రతి అడుగు అతడి నుంచి ఒక పాపాన్ని తొలగిస్తుంది. తరువాత అతడు మస్జిదులోనికి ప్రవేశించి, కూర్చుని సలాహ్ కొరకు ఎదురుచూస్తూ వేచి ఉన్నట్లయితే, అతడు వేచి ఉన్న కాలమంతా అతడు సలాహ్ లోనే గడిపినంత పుణ్యాన్ని పొందుతాడు. అతడు, తాను సలాహ్ ఆచరించి కూర్చుని ఉన్న స్థలం లోనే గడిపినంత కాలం దైవదూతలు అతని కొరకు అల్లాహ్ ను ప్రార్థిస్తూ, ఇలా అంటారు: “ఓ అల్లాహ్! అతడిని క్షమించు (అతడి పాపాలను మన్నించు); ఓ అల్లాహ్! అతడిని కరుణించు; ఓ అల్లాహ్! అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”. ఇలా అతడు తన ఉదూను భంగపరచనంత వరకు, లేదా, ఇతరులకు లేదా దైవదూతలకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంతవరకు ప్రార్థిస్తూ ఉంటారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. (షరియత్ అంగీకరించే ఏదైనా కారణం వల్ల) ఎవరైనా ఒంటరిగా తన ఇంటిలోనో, లేక తన వ్యాపార స్థలంలోనో సలాహ్ ఆచరించడం అంగీకార యోగ్యమైనదే; అయితే ఏ కారణమూ లేకుండా జామాఅత్ తో సలాహ్ ఆచరించుట వదిలి వేసినట్లయితే అతడు ఘోరమైన పాపానికి ఒడిగట్టినట్లే.
  2. మస్జిదులో జామాఅత్’తో సలాహ్ ఆచరించుట, ఒక వ్యక్తి ఒంటరిగా ఆచరించే సలాహ్ కంటే, ఇరవై ఐదు లేక ఇరవైఆరు లేక ఇరవై ఏడు రెట్లు ఉత్తమమైనది.
  3. దైవదూతల కార్యాచరణలో, విశ్వాసుల కొరకు దుఆ చేయుట కూడా ఒకటి అని ఈ హదీసు ద్వారా తెలుస్తున్నది.
  4. ఇంటి నుండే వుజూ చేసి మస్జిదునకు బయలుదేరుట ఉత్తమం.

అనువాదాలను చూపించండి

58 భాష
EN English الإنجليزية
UR اردو الأوردية
ES Español الإسبانية
ID Indonesia الإندونيسية
UG ئۇيغۇرچە الأيغورية
BN বাংলা البنغالية
FR Français الفرنسية
TR Türkçe التركية
RU Русский الروسية
BS Bosanski البوسنية
SI සිංහල السنهالية
HI हिन्दी الهندية
ZH 中文 الصينية
FA فارسی الفارسية
VI Tiếng Việt الفيتنامية
TL Tagalog تجالوج
KU Kurdî الكردية
HA Hausa الهوسا
PT Português البرتغالية
ML മലയാളം المليالم
SW Kiswahili السواحيلية
MY မြန်မာ البورمية
TH ไทย التايلندية
DE Deutsch الألمانية
PS پښتو بشتو
AS অসমীয়া الأسامية
SQ Shqip الألبانية
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча القيرقيزية
NE नेपाली النيبالية
YO Yorùbá اليوروبا
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda الكينياروندا
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy المالاجاشية
IT Italiano الإيطالية
OM Oromoo الأورومو
KN ಕನ್ನಡ الكانادا
WO Wolof الولوف
AZ Azərbaycan الأذربيجانية
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية
వర్గీకరణలు