عَنْ عَمْرِو بْنِ الحَارِثِ خَتَنِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَخِي أُمِّ المؤمِنين جُوَيْرِيَةَ بِنْتِ الحَارِثِ رَضِيَ اللَّهُ عَنْهُم، قَالَ:
مَا تَرَكَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عِنْدَ مَوْتِهِ دِرْهَمًا وَلاَ دِينَارًا وَلاَ عَبْدًا وَلاَ أَمَةً وَلاَ شَيْئًا، إِلَّا بَغْلَتَهُ البَيْضَاءَ، وَسِلاَحَهُ، وَأَرْضًا جَعَلَهَا صَدَقَةً.

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2739]
المزيــد ...

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బావమరిది, ఉమ్ముల్ ముమినీన్ జువైరియహ్ బింతె అల్-హారిథ్ సోదరుడైన అమర్ ఇబ్నె అల్-హారిథ్ రదియల్లాహు అన్హుమ్ ఇలా పలికినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు తన తెల్లని కంచరగాడిదను, తన ఆయుధాలను మరియు దానంగా ఇచ్చిన భూమిని మాత్రమే వదలి వెళ్ళారు. ఇవి తప్ప ఆయన ఒక్క దిర్హముగాని, దీనారుగాని, బానిసగాని, బానిసరాలిని గాని, మరే వస్తువును కూడా వదలి వెళ్ళలేదు.

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ నమోదు చేసినారు:] - [సహీహ్ అల్ బుఖారీ - 2739]

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు, తాను స్వారీ చేసే తన తెల్లని కంచరగాడిదను, తాను ధరించే తన ఆయుధాలను మరియు ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాటసారుల కోసం దానం చేసిన కొంత భూమిని మాత్రమే వదలివెళ్ళారు. ఇవి తప్ప ఆయన వెండి దిర్హముగానీ, బంగారు దీనారు గానీ, బానిస గానీ, బానిసరాలిని గానీ, మేకలను గానీ, ఒంటెలను గానీ లేదా మరే ఇతర సంపదను గానీ వదలి వెళ్ళలేదు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ప్రవక్తలకు వారసులుండరు.
  2. ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్ల) తన మరణం తరువాత ఏమి వదిలి వెళ్ళారో తెలుపబడుతున్నది.
  3. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దయ, తన దానగుణం మరియు దాతృత్వం కారణంగా, ముఖ్యమైన (విలువైన) దేనినీ వదిలి పెట్టకుండా మరణించారు.
  4. కిర్మానీ ఇలా పలికినారు: (వ జఅలహా) అనే ఆయన మాటలోని సర్వనామం కేవలం భూమిని మాత్రమే కాకుండా, ఆ మూడింటిని, అనగా: కంచర గాడిద, ఆయుధం మరియు భూమిని సూచిస్తుంది.
  5. అల్ ఖతన్: భార్య సోదరుడు, మరియు అల్ అఖ్తాన్ అంటే భార్య వైపు బంధువులు.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإندونيسية ఇంకా (28)
ఇంకా