عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَشْكُرُ اللَّهَ مَنْ لَا يَشْكُرُ النَّاسَ»

[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 4811]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«జనులకు కృతజ్ఞత చూపని వాడు అల్లాహ్‌కు కృతజ్ఞత చూపడు»

[ప్రామాణికమైన హదీథు] - [అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:] - [సునన్ అబీదావూద్ - 4811]

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రజలు చేసిన మేలు మరియు మంచికి బదులుగా వారికి కృతజ్ఞతలు తెలుపని వాడు, సాధారణంగా అల్లాహ్'కు కూడా కృతజ్ఞత తెలుపడు. ఎందుకంటే ఈ రెండు విషయాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఎవరి స్వభావం మరియు అలవాటు ప్రజల అనుగ్రహాల పట్ల కృతఘ్నత చూపడం మరియు వారికి కృతజ్ఞతలు తెలుపకపోవడమై ఉంటుందో, అల్లాహ్ అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపడం మరియు ఆయనకు కృతజ్ఞతలు తెలపడంలో లోపం చేయడం కూడా అతని అలవాటుగా ఉంటుంది.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ప్రజలు చేసిన మేలుకు కృతజ్ఞత తెలుపుటలో ప్రాముఖ్యత ఉన్నది.
  2. వాస్తవానికి అనుగ్రహదాత అల్లాహ్ మాత్రమే మరియు సృష్టిరాశులు ఆయన తాను కోరిన వారికి వశపరిచే మాధ్యమాలు, సాధనాలు మాత్రమే, అందువలన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం కూడా అల్లాహ్'కు కృతజ్ఞతలు తెలపడంలో భాగమే.
  3. ప్రజల ఉపకారము పట్ల కృతజ్ఞత అనేది పరిపూర్ణమైన సత్శీలానికి నిదర్శనం.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإندونيسية ఇంకా (28)
ఇంకా