عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ:
مَا شَبِعَ آلُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مُنْذُ قَدِمَ المَدِينَةَ مِنْ طَعَامِ البُرِّ ثَلاَثَ لَيَالٍ تِبَاعًا، حَتَّى قُبِضَ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5416]
المزيــد ...

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారు మదీనా వచ్చినప్పటి నుంచి ఎన్నడూ వరుసగా మూడు రోజుల పాటు కడుపునిండా గోధుమ రొట్టెలు తినలేదు. ఆయన మరణించేదాకా అదే పరిస్థితి.

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 5416]

వివరణ

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారు మదీనా వచ్చినప్పటి నుంచి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణించేంత వరకు, వరుసగా మూడు రోజుల పాటు గోధుమ రొట్టెలు కడుపునిండా తినలేదు.

من فوائد الحديث

  1. ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన కుటుంబం యొక్క నిరాడంబరమైన జీవన పరిస్థితిని స్పష్టం చేస్తున్నది, ఎందుకంటే అసలైన జీవితం పరలోక జీవితమే.
  2. ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: వారు తరచుగా కడుపునిండా తినకపోవడానికి కారణం వారి వద్ద వస్తువుల కొరత ఉండటమేనని స్పష్టమవుతుంది, అయితే కొన్నిసార్లు వారికి ఏమైనా లభించినప్పటికీ, వారు తమ కంటే ఇతరులకే ప్రాధాన్యత ఇచ్చేవారు (దానం చేసేవారు).
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఇంకా (28)
ఇంకా