عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ:
مَا أَكَلَ آلُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَكْلَتَيْنِ فِي يَوْمٍ إِلَّا إِحْدَاهُمَا تَمْرٌ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6455]
المزيــد ...

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారు ఒక రోజులో రెండు పూటల భోజనం చేస్తే, అందులో ఒకటి కేవలం ఖర్జూరాలు మాత్రమే ఉండేవి.

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 6455]

వ్యాఖ్యానము

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు ఒక రోజులో రెండు పూటల భోజనం తినలేదు, ఒకవేళ తింటే, అందులో ఒక పూట ఖర్జూరం మాత్రమే ఉండేది.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన ఇంటివారి యొక్క అణుకువను ఇది సూచిస్తుంది, కొన్నిసార్లు వారికి రోజంతా ఒక్క పూట భోజనం మాత్రమే లభించేది.
  2. వారికి ఇతర వస్తువుల కంటే ఖర్జూరం సులభంగా లభించేది.
  3. ప్రవక్తల గుణగణాలలో మరియు ప్రవక్తల నాయకుని జీవన విధానంలో ఒకటైన వైరాగ్యం మరియు కొద్దిపాటి ఉపాధితో సంతృప్తి చెందడం యొక్క గొప్పతనం తెలుస్తున్నది.
  4. ఒక రోజులో రెండుసార్లు భోజనం చేయడం అనేది అనుమతించబడిన మరియు ధర్మసమ్మతమైన విషయం. ఇది అరబ్బుల యొక్క ప్రసిద్ధ ఆచారాలలో ఒకటి, వారు రోజుకు రెండు భోజనాలు చేసేవారు: మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం.
అనువాదాలను చూపించండి
ఇంకా