عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ:
كُنَّا فِي غَزَاةٍ فَكَسَعَ رَجُلٌ مِنَ المُهَاجِرِينَ رَجُلًا مِنَ الأَنْصَارِ، فَقَالَ الأَنْصَارِيُّ: يَا لَلْأَنْصَارِ، وَقَالَ المُهَاجِرِيُّ: يَا لَلْمُهَاجِرِينَ، فَسَمَّعَهَا اللَّهُ رَسُولَهُ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «مَا هَذَا؟» فَقَالُوا: كَسَعَ رَجُلٌ مِنَ المُهَاجِرِينَ رَجُلًا مِنَ الأَنْصَارِ، فَقَالَ الأَنْصَارِيُّ: يَا لَلْأَنْصَارِ، وَقَالَ المُهَاجِرِيُّ: يَا لَلْمُهَاجِرِينَ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «دَعُوهَا فَإِنَّهَا مُنْتِنَةٌ» قَالَ جَابِرٌ: وَكَانَتِ الأَنْصَارُ حِينَ قَدِمَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَكْثَرَ، ثُمَّ كَثُرَ المُهَاجِرُونَ بَعْدُ، فَقَالَ عَبْدُ اللَّهِ بْنُ أُبَيٍّ: أَوَقَدْ فَعَلُوا، وَاللَّهِ لَئِنْ رَجَعْنَا إِلَى المَدِينَةِ لَيُخْرِجَنَّ الأَعَزُّ مِنْهَا الأَذَلَّ، فَقَالَ عُمَرُ بْنُ الخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ: دَعْنِي يَا رَسُولَ اللَّهِ أَضْرِبُ عُنُقَ هَذَا المُنَافِقِ، قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «دَعْهُ، لاَ يَتَحَدَّثُ النَّاسُ أَنَّ مُحَمَّدًا يَقْتُلُ أَصْحَابَهُ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4907]
المزيــد ...

జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
మేము ఒక యుద్ధంలో ఉన్నాము. అప్పుడు ఒక ముహాజిర్ ఒక అన్సారీని వెనుక నుండి కొట్టాడు. దాంతో ఆ అన్సారీ ‘ఓ అన్సారులారా!’ అని, ఆ ముహాజిర్ ‘ఓ ముహాజిర్లారా!’ అని కేకలు వేశారు. అల్లాహ్ ఈ విషయాన్ని తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వినిపించాడు. ఆయన ‘ఇదేమిటి?’ అని అడిగారు. దానికి వారు, ‘ఒక ముహాజిర్ ఒక అన్సారీని వెనుక నుండి కొట్టాడు, అప్పుడు అన్సారీ ‘ఓ అన్సారులారా!’ అని, ముహాజిర్ ‘ఓ ముహాజిర్లారా!’ అని కేకలు వేశారు’ అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘దీనిని వదిలేయండి, నిశ్చయంగా ఇది దుర్గంధ భరితమైనది’. జాబిర్ ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (మదీనాకు) వచ్చినప్పుడు అన్సారీల సంఖ్య ఎక్కువగా ఉండేది, ఆ తర్వాత ముహాజిర్ల సంఖ్య పెరిగింది. అప్పుడు అబ్దుల్లా బిన్ ఉబై ఇలా అన్నాడు: వారు ఇలా చేశారా? అల్లాహ్ సాక్షిగా! మనం మదీనాకు తిరిగి వెళ్ళిన తర్వాత, గౌరవనీయులు నీచులను అక్కడి నుండి తప్పక వెళ్ళగొడతారు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ ప్రవక్తా! నన్ను అనుమతించండి, నేను ఈ కపటుడి మెడ నరుకుతాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘అతనిని వదిలేయ్, ముహమ్మద్ తన సహచరులనే చంపుతున్నాడని ప్రజలలో మాట వ్యాపించకుండా ఉండేందుకు’.

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 4907]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక యుద్ధ యాత్రలో తన సహచరులైన ముహాజిర్లు మరియు అన్సార్లతో (రదియల్లాహు అన్హుమ్) కలిసి ప్రయాణిస్తుండగా, ముహాజిర్లలోని ఒక వ్యక్తి అన్సార్లలోని ఒక వ్యక్తి పిరుదులపై తన చేతితో కొట్టాడు. అప్పుడు అన్సారీ, 'నాకు సహాయం చేయండి ఓ అన్సారులారా' అని, మరియు ముహాజిర్, 'నాకు సహాయం చేయండి ఓ ముహాజిరులారా' అని పిలవగా, దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విని, 'ఇదేమిటి?' అని పలికారు. వారు ఇలా అన్నారు: ముహాజిర్ లకు చెందిన ఒక వ్యక్తి, అన్సార్ లకు చెందిన ఒక వ్యక్తిని వెనుక భాగంపై తన చేతితో కొట్టాడు, అప్పుడు ఆ అన్సారీ, ‘ఓ అన్సారులారా! నన్ను ఆదుకోండి’ అని అన్నాడు, మరియు ఆ ముహాజిర్, ‘ఓ ముహాజిరులారా! నన్ను ఆదుకోండి’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ అజ్ఞాన కాలపు అలవాటును విడిచిపెట్టండి, ఎందుకంటే ఇది నీచమైనది, అసహ్యకరమైనది మరియు బాధాకరమైనది; అదేమిటంటే, ఒక వ్యక్తి తన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయినప్పుడు, అతను తన జాతి వారిని పిలుస్తాడు, అప్పుడు వారు, అతను అన్యాయం చేసేవాడైనా లేదా అన్యాయానికి గురైనవాడైనా సరే, తమ అజ్ఞానం మరియు గుడ్డి పక్షపాతం కారణంగా అతనికి సహాయం చేయడానికి పరుగెత్తుకు వస్తారు.” జాబిర్ తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ హిజ్రత్ చేసి మదీనా వచ్చినప్పుడు అన్సారులు ఎక్కువగా ఉండేవారు, ఆ తర్వాత ముహాజిర్లు ఎక్కువయ్యారు. అప్పుడు కపటుల సర్దారు అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ ఇలా పలికాడు: "విషయం ఈ స్థాయికి చేరిందా?! అల్లాహ్ సాక్షిగా, మనం మదీనాకు తిరిగి వెళ్ళిన తరువాత గౌరవనీయులమైన మనం - అంటే నేను మరియు నాతో ఉన్నవారు - మదీనా నుండి నీచులను - అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయనతో ఉన్నవారు - తప్పకుండా వెళ్ళగొడతాము. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, "ఓ ప్రవక్తా! నన్ను వదిలి వేయండి, ఈ కపటవిశ్వాసి మెడ నేను నరుకుతాను" అని అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, "అతన్ని వదిలిపెట్టు. ప్రజలు 'ముహమ్మద్ తన అనుచరులనే చంపుతున్నాడు' అని మాట్లాడుకోకూడదు" అని సెలవిచ్చారు.

من فوائد الحديث

  1. మాటల ద్వారా లేదా చేతల ద్వారా అయినా, అజ్ఞాన కాలపు చెడు అలవాట్లు మరియు సాంప్రదాయాలు నిషేధించబడ్డాయి. ఇస్లాం ప్రజలను వాటి నుండి దూరం చేసి, వారికి ఏది సరైనదో మరియు సత్యమైనదో దాని వైపు మార్గనిర్దేశం చేయడానికి వచ్చింది.
  2. ఒక దుర్గంధమైన, అసహ్యకరమైన వస్తువు నుండి ఎలా అయితే జాగ్రత్తపడతారో అలాగే అసత్యపు వర్గవాదం నుండి కూడా జాగ్రత్తపడాలని హెచ్చరించబడుతున్నది.
  3. శత్రుత్వం మరియు విద్వేషాన్ని రేకెత్తించే ప్రతీ విషయం నుండి వారించబడింది.
  4. ఇమామ్ అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ ﷺ దానిని 'అజ్ఞానకాలపు పిలుపు' అని పేర్కొనడం, ఆయనకు అది ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టమవుతున్నది. ఎందుకంటే, ప్రాపంచిక విషయాలు మరియు వాటికి సంబంధించిన వ్యవహారాలలో తమ తమ తెగల ఆధారంగా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం అజ్ఞానకాలపు పద్ధతులలో ఒకటి. అజ్ఞానకాలంలో ప్రజలు తమ హక్కులను తమ తెగల మరియు గోత్రాల బలంతో సాధించుకునేవారు. అయితే ఇస్లాం ధర్మం వచ్చి దానిని రద్దు చేసింది, మరియు వివాదాలను ఇస్లామీయ ధర్మశాస్త్ర నియమాల (షరిఅత్ తీర్పుల) ద్వారా పరిష్కరించింది. కాబట్టి, ఒక వ్యక్తి మరొకరిపై దౌర్జన్యం చేస్తే, న్యాయమూర్తి (ఖాజీ) వారి మధ్య తీర్పు ఇస్తాడు, మరియు ఇస్లాం ధర్మం యొక్క నియమాల ప్రకారం, అతని దౌర్జన్యానికి తగిన శిక్షను విధిస్తాడు.
  5. అల్-సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: అజ్ఞాన కాలపు (జాహిలియ్యా) ప్రజల వలే, కేవలం తన తెగకు చెందినవాడనే కారణంతో ఒకరికి సహాయం చేయడం అసత్యమైన (బాతిల్) విషయం అని స్పష్టం చేయబడింది. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ తెగను (సహాయం కోసం) పిలవడానికి ఎలాంటి కారణమూ లేదు. అయితే సత్యానికి (హఖ్) సహాయం చేయడం ప్రతి విశ్వాసిపై (ముఅ’మిన్) తప్పనిసరి విధి, ఆ వ్యక్తి తన తెగకు చెందినవాడైనా కాకపోయినా సరే.
  6. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు రదియల్లాహు అన్హుమ్ పట్ల కపటవిశ్వాసుల దుర్భాష మరియు తెగింపు తెలుస్తున్నది.
  7. కపటుల నుండి కలిగే బాధల పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసాధారణమైన సహనం మరియు ఓర్పును కలిగి ఉండేవారు.
  8. ప్రజలను ఇస్లాంలో ప్రవేశించకుండా దూరం చేసే ప్రతి చర్య నుండి హెచ్చరించబడుతుంది, అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, 'ముహమ్మద్ తన సహచరులనే చంపుతున్నాడు' అని ప్రజలు అంటారేమోనని కపట విశ్వాసులను వధించకుండా విరమించుకున్నారు.
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఇంకా (28)
ఇంకా