1. ప్రధాన పేజీ
  2. వర్గీకరణలు
  3. అల్ అఖీద

హదీథు ఎవరైతే అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించకుండా (షిర్క్ చేయకుండా) ఆయనను కలుస్తాడో, అతని పాపాలు అతనికి హాని చేయలేవు. మరియు ఎవరైతే ఆయనకు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, అతని పుణ్యకార్యాలు అతనికి ప్రయోజనం చేకూర్చలేవు

عَنْ عَبْدَ اللهِ بْنِ عَمْرٍو رَضيَ اللهُ عَنْهُمَا يَقُولُ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ لَقِيَ اللهَ لَا يُشْرِكُ بِهِ شَيْئًا لَمْ تَضُرَّهُ مَعَهُ خَطِيئَةٌ، وَمَنْ مَاتَ وَهُوَ يُشْرِكُ بِهِ لَمْ يَنْفَعْهُ مَعَهُ حَسَنَةٌ».

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«ఎవరైతే అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించకుండా (షిర్క్ చేయకుండా) ఆయనను కలుస్తాడో, అతని పాపాలు అతనికి హాని చేయలేవు. మరియు ఎవరైతే ఆయనకు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, అతని పుణ్యకార్యాలు అతనికి ప్రయోజనం చేకూర్చలేవు.»

ప్రామాణికమైన హదీథు ఆహ్మద్ నమోదు చేసినారు: ముస్నద్ అహ్మద్ - 6586

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ఎవరైతే ఏకదైవారాధకుడిగా (తౌహీద్ పై) ఉంటూ, అల్లాహ్ కు దేనినీ సాటి కల్పించని స్థితిలో మరణించి ఆయనను కలుస్తాడో, అతను తన పాపాల కారణంగా నరకంలో శిక్షించబడినప్పటికీ, చివరికి అతని గమ్యస్థానం స్వర్గమే అవుతుంది. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, షిర్క్ తో పాటు చేసిన ఏ పుణ్యకార్యం కూడా అతనికి ప్రయోజనం చేకూర్చదు; మరియు అతనిపై స్వర్గం నిషిద్ధం (హరామ్) చేయబడుతుంది.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. షిర్కు చేయవద్దని హెచ్చరించబడింది - ఎందుకంటే అది పాపాలలో, తప్పులలో అత్యంత ఘోరమైనది మరియు అల్లాహ్ దానిని అస్సలు క్షమించడు.
  2. తౌహీద్ యొక్క ఘనత ఏమిటంటే, అది స్వర్గ ప్రవేశానికి కారణభూతమవుతుంది; నరకంలో శిక్షించబడిన తర్వాత అయినా సరే.
  3. మరణించే వరకు తౌహీద్ పై స్థిరంగా ఉండటం మరియు దానికి వ్యతిరేకమైన షిర్క్ నుండి దూరంగా ఉండటం యొక్క ప్రాధాన్యత.

అనువాదాలను చూపించండి

29 భాష
EN English الإنجليزية
UR اردو الأوردية
ID Indonesia الإندونيسية
BN বাংলা البنغالية
TR Türkçe التركية
RU Русский الروسية
BS Bosanski البوسنية
SI සිංහල السنهالية
HI हिन्दी الهندية
VI Tiếng Việt الفيتنامية
TL Tagalog تجالوج
KU Kurdî الكردية
HA Hausa الهوسا
PT Português البرتغالية
ML മലയാളം المليالم
SW Kiswahili السواحيلية
TH ไทย التايلندية
AS অসমীয়া الأسامية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ الكانادا
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية