عَنْ عِكْرِمَةَ:
أَنَّ عَلِيًّا رَضِيَ اللَّهُ عَنْهُ حَرَّقَ قَوْمًا، فَبَلَغَ ابْنَ عَبَّاسٍ فَقَالَ: لَوْ كُنْتُ أَنَا لَمْ أُحَرِّقْهُمْ لِأَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «لاَ تُعَذِّبُوا بِعَذَابِ اللَّهِ»، وَلَقَتَلْتُهُمْ كَمَا قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ بَدَّلَ دِينَهُ فَاقْتُلُوهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3017]
المزيــد ...
ఇక్రమ ఉల్లేఖన:
అలీ రదియల్లాహు అన్హు కొంతమందిని కాల్చేశారు. అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకు ఈ విషయం తెలిసినప్పుడు ఇలా తెలిపారు: 'ఒకవేళ నేను ఉంటే అలా కాల్చేసేవాడిని కాదు’ ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: మీరు అల్లాహ్ పెట్టె శిక్షతో ప్రజలను శిక్షించకండి నేను కేవలం వారిని హతమార్చేవాడిని ’ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా తెలిపారు: ఎవరైతే తన సత్యధర్మాన్ని విడిచి పెడతాడో అతడిని మరణశిక్ష విధించండి.’
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ నమోదు చేసినారు:] - [సహీహ్ అల్ బుఖారీ - 3017]
అలీ బిన్ అబూతాలిబ్ రదియల్లాహు అన్హు తన ధార్మిక విచక్షణతో, ఇస్లాం నుండి ధర్మభ్రష్టులైన కొంతమంది పాషండులను అగ్నితో కాల్చేశారు. ఈ విషయం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకు చేరగా, ఆయన వారిని హతమార్చిన చర్యను సమర్థించారు; అయితే వారిని అగ్నితో కాల్చడాన్ని వ్యతిరేకించారు. ఆయన ఇలా అన్నారు: ఒకవేళ నేను అతని స్థానంలో ఉంటే వారిని అగ్నితో కాల్చేవాడిని కాదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేశారు - అగ్నితో శిక్షించడం అగ్నికి ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తుంది. అయితే, వారిని కేవలం హతమార్చడమే సరిపోతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ‘ఎవరైతే ఇస్లాం నుండి ధర్మభ్రష్టుడై తన ధర్మాన్ని వేరొక ధర్మానికి మార్చుకుంటాడో, అతడికి మీరు మరణశిక్ష విధించండి’.