عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنه قَالَ:
مِنَ السُّنَّةِ إِذَا قَالَ الْمُؤَذِّنُ فِي أَذَانِ الْفَجْرِ حَيَّ عَلَى الْفَلَاحِ، قَالَ: الصَّلَاةُ خَيْرٌ مِنَ النَّوْمِ.

[صحيح] - [رواه ابن خزيمة والدارقطني والبيهقي] - [صحيح ابن خزيمة: 386]
المزيــد ...

అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“ఫజ్ర్ నమాజు కొరకు పలుకబడే అజాన్’లో “హయ్య అలల్ ఫలాహ్” (సాఫల్యము వైపునకు రండి) తరువాత “అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నిద్ర కంటే నమాజు ఉత్తమమైనది, శుభప్రదమైనది) అని పలుకుట సున్నత్’లో భాగము.”

[ప్రామాణికమైన హదీథు] - [ఇబ్న్ ఖుజైమ, దారు ఖుత్నీ మరియు బైహిఖీ నమోదు చేసినారు:] - [సహీహ్ ఇబ్నె ఖుజైమహ్ - 386]

వివరణ

అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సున్నత్’లో భాగంగా ఆమోదించిన విషయాలలో ఒకటి, ముఅజ్జిన్ (నమాజు కొరకు అజాన్ పలుకు వ్యక్తి), ప్రత్యేకించి ఫజ్ర్ నమాజు కొరకు పలికే అజాన్’లో “హయ్య అలల్ ఫలాహ్” (సాఫల్యము వైపునకు రండి) అని (రెండుసార్లు) పలికిన తరువాత, అతడు “అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నమాజు నిద్ర కంటే శుభరదమైనది) అని (రెండుసార్లు) పలకాలి.”

من فوائد الحديث

  1. ఈ హదీథులో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు యొక్క ప్రకటన “ఇది సున్నతులో భాగము”: అంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ‘సున్నత్’ (విధానము) అని అర్థము. దాని కారణంగా ఇది ‘మర్’ఫూ’ స్థాయి హదీథు నియమాన్ని కలిగి ఉంటుంది. అంటే ఉల్లేఖకుల పరంపర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేరి, హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆపాదించబడినది అని అర్థము.
  2. ముజ్జిన్ ‘ఫజ్ర్’ నమాజు కొరకు పలికే పిలుపులో (అజాన్’లో) "హయ్యా అల్లా అల్-ఫలాహ్" తర్వాత, "అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నమాజు, నిద్ర కంటే ఉత్తమం) అని రెండుసార్లు పలుకుట సిఫార్సు చేయబడింది. ఎందుకంటే, ప్రజలు ఇంకా తమ నిద్రలో ఉన్న సమయాన ఫజ్ర్ నమాజు జరుగుతుంది, వారు తమ నిద్రలో నుంచి లేచి నమాజు కొరకు వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఈ విషయములో మిగతా నమాజుల వలె కాకుండా, ‘ఫజ్ర్’ నమాజు ప్రత్యేకమైనది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية Канада الجورجية المقدونية الخميرية البنجابية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా