«لَو يُعطَى النّاسُ بدَعواهُم لادَّعَى رِجالٌ أموالَ قَومٍ ودِماءَهُم، ولَكِنَّ البَيِّنَةَ على المُدَّعِى، واليَمينَ على مَن أنكَرَ».
[صحيح] - [رواه البيهقي] - [السنن الكبرى للبيهقي: 21243]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ప్రజలకు వారు దావా చేసిన ప్రతిదానిని ఇచ్చివేస్తే, మనుషులు [ఇతర] వ్యక్తుల సంపదపై మరియు వారి రక్తంపై (అన్యాయంగా) దావా వేస్తారు. అయితే సాక్ష్యం చూపవలసిన బాధ్యత దావా చేసిన వానిపై ఉంటుంది; ప్రమాణం చేయడం దానిని వ్యతిరేకించే వానిపై ఉంటుంది.”
[దృఢమైనది] - [దాన్ని బైహిఖీ ఉల్లేఖించారు] - [السنن الكبرى للبيهقي - 21243]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: సాక్ష్యాలు గానీ లేదా తగిన ఆధారాలు గానీ లేకుండా ప్రజలు దావా చేసిన (క్లెయిమ్ చేసిన) దానిని ఇచ్చివేస్తే, కొంతమంది ఇతరుల డబ్బు మరియు రక్తాన్ని కూడా క్లెయిమ్ చేస్తారు. అయితే, దావా చేస్తున్న వ్యక్తి, తాను దావా చేస్తున్న దానికి సాక్ష్యం మరియు రుజువును తప్పనిసరిగా సమకూర్చాలి. అతని వద్ద సాక్ష్యం, రుజువు లేకపోతే, ఆ దావా ప్రతివాదికి సమర్పించబడుతుంది. అతను దానిని తిరస్కరించినట్లయితే, అతను ప్రమాణం చేయాలి, ఆ విధంగా అతడు నిర్దోషిగా ప్రకటించబడతాడు.