عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَلاَ أُخْبِرُكُمْ بِأَفْضَلَ مِنْ دَرَجَةِ الصِّيَامِ وَالصَّلاَةِ وَالصَّدَقَةِ؟» قَالُوا: بَلَى، قَالَ: «صَلاَحُ ذَاتِ البَيْنِ، فَإِنَّ فَسَادَ ذَاتِ البَيْنِ هِيَ الحَالِقَةُ».
[صحيح] - [رواه أبو داود والترمذي] - [سنن الترمذي: 2509]
المزيــد ...
అబూ ద్’దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«నేను మీకు ఉపవాసం, నమాజు మరియు దానధర్మాల స్థాయి కంటే ఉత్తమమైన దాని గురించి తెలియజేయనా?» వారు, “తప్పకుండా తెలియజేయండి” అన్నారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «పరస్పర సంబంధాలను చక్కదిద్దడం, ఎందుకంటే పరస్పర సంబంధాలు చెడిపోవడమే వినాశము».
[ప్రామాణికమైన హదీథు] - [అబూదావూద్ మరియు అత్తిర్మిదీ నమోదు చేసినారు:] - [సునన్ అత్తిర్మిదీ - 2509]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా ప్రశ్నించారు: నఫిల్ ఉపవాసాలు, నమాజులు మరియు దానధర్మాలను అధికంగా ఆచరించడం కంటే ఎక్కువ పుణ్యప్రదమైన దాని గురించి మీకు తెలియజేయనా? వారు, ‘తప్పకుండా’ అని అన్నారు. అప్పు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: వివాదంలో ఉన్న వారి మధ్య సయోధ్య (అవసరం), ఎందుకంటే వివాదం ప్రజల మధ్య విభజన, అపరిచిత్వం, పరస్పర ద్వేషం మరియు పరస్పర విముఖతను కలిగిస్తుంది. నిశ్చయంగా, పరస్పర సంబంధాలు చెడిపోవడం వల్ల కలిగే ద్వేషం ఒకలాంటి గుణం, అది కత్తి వెంట్రుకలను ఎలాగైతే సమూలంగా కత్తిరించి వేస్తుందో, అదే విధంగా ధర్మాన్ని మరియు ప్రాపంచిక జీవితాన్ని నాశనం చేసి సమూలంగా పెరికివేస్తుంది.