عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«كُلُّ سُلاَمَى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ، كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ يَعْدِلُ بَيْنَ الِاثْنَيْنِ صَدَقَةٌ، وَيُعِينُ الرَّجُلَ عَلَى دَابَّتِهِ فَيَحْمِلُ عَلَيْهَا أَوْ يَرْفَعُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ، وَالكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ، وَكُلُّ خُطْوَةٍ يَخْطُوهَا إِلَى الصَّلاَةِ صَدَقَةٌ، وَيُمِيطُ الأَذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2989]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు.
“మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం అవుతుంది; ఒక వ్యక్తికి అతని వాహనం విషయములో – అతడు దాని పైకి ఎక్కుటలో గానీ, లేక అతని ప్రయాణ సామాగ్రిని వాహనం పైకి చేరవేయుటలోగానీ సహాయపడుట ఒక దానం అవుతుంది; ఒక మంచి మాట దానం అవుతుంది; జమా’అత్ తో సలాహ్ (నమాజు) ఆచరించుటకు వేసే ప్రతి అడుగూ దానం అవుతుంది; మరియు మార్గం నుండి హానికరమైన వస్తువులను తొలగించడం అనేది ఒక దానం అవుతుంది.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2989]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, యుక్తవయస్సుకు చేరుకున్న ప్రతి ముస్లిం తన శ్రేయస్సు కొరకు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు స్వచ్ఛందంగా కృతజ్ఞతలు తెలుపుతూ తన ఎముకలలోని కీళ్ల సంఖ్యకు బదులు ప్రతిరోజూ ఒక్కో కీలుకు ఒక దానం ఇవ్వాలని వివరించారు; ఎందుకంటే ఆయన తన ఎముకలను ముడుచుకునేలా మరియు విస్తరించగలిగేలా కీళ్ళుగా చేసాడు గనుక. మరియు ఈ దానము మంచి పనులు చేయడం వల్ల పూర్తి అవుతుంది; ఇది ధనాన్ని దానంగా ఇవ్వడంపై ఆధారపడి ఉండదు; మంచిపనులు అంటే ఉదాహరణకు: ఇద్దరు వ్యక్తుల మధ్య, లేక రెండు వర్గాల మధ్య న్యాయం చేయడం, వారి మధ్య సయోధ్య కుదర్చడం – అది దానం అవుతుంది. తన వాహనం పైకి ఎక్కలేని వ్యక్తిని, అతడి వాహనం పైకి చేర్చుట, లేక అతని ప్రయాణ సామాగ్రిని ఎత్తి వాహనంపై పెట్టుట వంటివి కూడా దానంగా పరిగణించబడతాయి. ఒక మంచి మాట, అల్లాహ్ యొక్క స్మరణలో ఒక స్మరణ వాక్యమును పలుకుట, దుఆ చేయుట, మరియు సలాం చేయుట – మొదలైనవన్నీ దానములే. అలాగే సలాహ్ (నమాజు) ఆచరించుట కొరకు నీవు వేసే ప్రతి అడుగు కూడా ఒక దానమే అవుతుంది. ఇంకా మార్గము నుండి ప్రమాదకరమైన మరియు హానికరమైన వస్తువులను తొలగించడం కూడా దానమే.