عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنين رَضيَ اللهُ عنها قَالَتْ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَسْتَفْتِحُ الصَّلَاةَ بِالتَّكْبِيرِ، وَالقِرَاءَةِ، بِـ الحَمْدُ لِلَّهِ رَبِّ العَالَمِينَ، وَكَانَ إِذَا رَكَعَ لَمْ يُشْخِصْ رَأْسَهُ وَلَمْ يُصَوِّبْهُ، وَلَكِنْ بَيْنَ ذَلِكَ، وَكَانَ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوعِ لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيَ قَائِمًا، وَكَانَ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ السَّجْدَةِ لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيَ جَالِسًا، وَكَانَ يَقُولُ فِي كُلِّ رَكْعَتَيْنِ التَّحِيَّةَ، وَكَانَ يَفْرِشُ رِجْلَهُ اليُسْرَى وَيَنْصِبُ رِجْلَهُ اليُمْنَى، وَكَانَ يَنْهَى عَنْ عُقْبَةِ الشَّيْطَانِ، وَيَنْهَى أَنْ يَفْتَرِشَ الرَّجُلُ ذِرَاعَيْهِ افْتِرَاشَ السَّبُعِ، وَكَانَ يَخْتِمُ الصَّلَاةَ بِالتَّسْلِيمِ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 498]
المزيــد ...
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ నమాజును తక్బీర్ ద్వారా, మరియు ఖిరాత్ పఠనాన్ని ‘అల్హందులిల్లాహి రబ్బీల్ ఆలమీన్’ ద్వారా ప్రారంభించేవారు, రుకూ చేసేటప్పుడు తలను మరీ క్రిందికి మరీ పైకి కాకుండా (వీపుకు) సమానంగా ఉంచేవారు, రుకూ నుండి లేచిన తరువాత స్థిరంగా నిలబడనంత వరకు సజ్దాలోకి వెళ్ళేవారు కాదు, సజ్దా నుండి తల లేపి సక్రమంగా కూర్చోనంత వరకు మరో సజ్దా చేసేవారు కాదు, ప్రతీ రెండు రకాతులలో ‘అత్తహియ్యాత్’ చదివేవారు, ఎడమ కాలును పరచి కుడికాలు నిలబెట్టి కూర్చునేవారు, షైతాన్ మాదిరి కూర్చోవడాన్ని వారించేవారు, జంతువుల వలె రెండు చేతులను నేలపై చాచి పెట్టడాన్ని వారించేవారు, చివరగా తన నమాజును సలాం చేస్తూ ముగించేవారు.
[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 498]
విశ్వాసులకు తల్లి ఆయిషా రదియల్లాహు అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు గురించి ఇలా తెలిపారు: ఆయన తక్బీరే తహ్రీమతో నమాజు ప్రారంభించేవారు, «అల్లాహు అక్బర్» అని పలికేవారు, మరియు సూరతుల్ ఫాతిహాతో పఠనాన్ని ప్రారంభించేవారు: «الحَمْدُ لِلَّهِ رَبِّ العَالَمِينَ... (సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు...)». ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ చేసినప్పుడు, తన తలను పైకి గానీ క్రిందికి గానీ వంచకుండా, దానిని (వీపుకు) సమంగా నిటారుగా ఉంచేవారు. మరియు రుకూ నుండి లేచినప్పుడు, సజ్దా చేయడానికి ముందు పూర్తిగా నిటారుగా నిలబడేవారు. మరియు మొదటి సజ్దా నుండి తల ఎత్తినప్పుడు, పూర్తిగా కూర్చుని స్థిరపడిన తరువాతే రెండవ సజ్దా చేసేవారు. ఆయన ప్రతి రెండు రకాతుల తర్వాత తషహ్హుద్ కోసం కూర్చుని, « التحيات لله والصلوات والطيبات... (సమస్త అభివాదాలు, ప్రార్థనలు మరియు పవిత్రమైనవన్నీ అల్లాహ్ కొరకే...)» అని పఠించేవారు. ఆయన రెండు సజ్దాల మధ్యలో లేదా తషహ్హుద్ కోసం కూర్చున్నప్పుడు, తన ఎడమ కాలును పరచి దానిపై కూర్చుని, కుడి కాలును నిలబెట్టేవారు. నమాజు చేసేవాడు తన నమాజులో షైతాను వలె కూర్చోవడం నిషేధం. అది ఎలాగంటే, తన పాదాలను నేలపై పరచి, తన మడమల మీద కూర్చోవడం. లేదా తన పిరుదులను నేలకు ఆనించి, కాళ్ళను నిటారుగా ఉంచి, కుక్క కూర్చున్నట్లు తన చేతులను నేలపై పెట్టడం. లేదా నమాజు చేసేవాడు సజ్దాలో మృగాల వలె తన మోచేతులను పరచి చాచడం. ఆయన ఒకసారి కుడి వైపు మరియు మరొకసారి ఎడమ వైపు «అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్» అని సలాం పలుకుతూ తన నమాజును ముగించేవారు.