1. ప్రధాన పేజీ
  2. వర్గీకరణలు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీథు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనాబత్ గుస్ల్ (స్నానం) ఒక ‘సా’ నీటితో, మరియు ఉదూ ఒక ‘ముద్’ నీటితో పూర్తి చేసేవారు

عَنْ سَفِينَةَ رَضيَ اللهُ عَنْهُ قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُغَسِّلُهُ الصَّاعُ مِنَ المَاءِ مِنَ الجَنَابَةِ، وَيُوَضِّئُهُ المُدُّ.

సఫీనహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనాబత్ గుస్ల్ (స్నానం) ఒక ‘సా’ నీటితో, మరియు ఉదూ ఒక ‘ముద్’ నీటితో పూర్తి చేసేవారు.

ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: సహీహ్ ముస్లిం - 326

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్ గుస్ల్ స్నానము’ ఒక ‘సా’ నీళ్ళతో పూర్తి చేసేవారు, అలాగే ఉదూను ఒక ‘ముద్’ నీళ్ళతో పూర్తి చేసేవారు. ఒక ‘సా’ నాలుగు ‘ముద్’ లకు సమానం. ఒక ‘ముద్’ అంటే ఓ మోస్తరు ఎదిగిన వ్యక్తి యొక్క ఒక దోసిలి నిండా పట్టేటంత పరిమాణానికి సమానము.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. గుస్ల్ మరియు ఉదూలకు నీటిని పొదుపుగా వాడుట మరియు నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ దుబారా చేయకుండా జాగ్రత్తపడుట ఇవి షరియత్ బోధనలు.
  2. గుస్ల్ చేయుటకు మరియు ఉదూ చేయుటకు అవసరమైనంత వరకే (వీలైనంత తక్కువ) నీటిని ఉపయోగించాలి – ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.
  3. ఇందులో అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే గుస్ల్ గానీ లేక ఉదూ గానీ పరిపూర్ణంగా ఆచరించుట, అయితే ఈ లక్ష్యాన్ని సాధించుటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్’ను, ఆ ఆచరణకు సంబంధించిన విధి విధానాలను, దుబారాకు పోకుండా అలా అని మరీ పిసినారితనానికి పాల్పడకుండా, సమయాన్నీ, సందర్భాన్నీ, నీటి యొక్క పరిమాణాన్ని, అందుబాటులో ఉన్న నీటియొక్క మొత్తాన్ని, ఇంకా ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
  4. 'జనాబహ్' అనే పదం వీర్య స్ఖలనం చేసి ఉన్న లేదా లైంగిక సంభోగములో పాల్గొని ఉన్న వారి స్థితిని సూచిస్తుంది. ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారు ఆ స్థితి నుండి తమను తాము పరిశుద్ధ పరుచుకోనంత వరకు సలాహ్ (నమాజు) మరియు ఇతర ఆరాధనల నుండి దూరంగా ఉంటారు (ఇజ్’తినాబ్), కాబట్టి ఆ స్థితికి ‘జనాబత్’ అని, ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి ‘జునూబి’ అనే పేరు ఇవ్వడం జరిగింది.
  5. ‘సా’: అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో బరువును, ద్రవాలను కొలవడానికి ఉపయోగించే ప్రసిద్ధ కొలమానము. ఒక ‘సా’ 480 మిథ్’ఖాల్’ల మంచి గోధుమలకు, మరియు లీటర్లలో చూసినట్లయితే 3 లీటర్లకు సమానం.
  6. ‘ముద్’: ఇది ఒక అధికారిక కొలమానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ఉపయేగించబడేది. ఒక ‘ముద్’ అంటే ఓ మోస్తరుగా ఎదిన వ్యక్తి యొక్క దోసిట నిండుగా పట్టేటంత మొత్తము. ఇది ఒక ‘సా’ యొక్క నాలుగవ భాగము. ఈ నాటి కొలమానములో చూసినట్లయితే, ధర్మ పండితుల ఏకాభిప్రాయము ప్రకారము, 750 మీ.లీ.

అనువాదాలను చూపించండి

29 భాష
EN English الإنجليزية
UR اردو الأوردية
ID Indonesia الإندونيسية
BN বাংলা البنغالية
TR Türkçe التركية
RU Русский الروسية
BS Bosanski البوسنية
SI සිංහල السنهالية
HI हिन्दी الهندية
VI Tiếng Việt الفيتنامية
TL Tagalog تجالوج
KU Kurdî الكردية
HA Hausa الهوسا
PT Português البرتغالية
ML മലയാളം المليالم
SW Kiswahili السواحيلية
TH ไทย التايلندية
AS অসমীয়া الأسامية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ الكانادا
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية