عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ رَضيَ اللهُ عنهُ قَالَ:
قَالَ لِي النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «اقْرَأْ عَلَيَّ»، قُلْتُ: يَا رَسُولَ اللَّهِ، أَأَقْرَأُ عَلَيْكَ، وَعَلَيْكَ أُنْزِلَ؟ قَالَ: «نَعَمْ» فَقَرَأْتُ سُورَةَ النِّسَاءِ حَتَّى أَتَيْتُ إِلَى هَذِهِ الآيَةِ: {فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ، وَجِئْنَا بِكَ عَلَى هَؤُلاَءِ شَهِيدًا} [النساء: 41]، قَالَ: «حَسْبُكَ الآنَ» فَالْتَفَتُّ إِلَيْهِ، فَإِذَا عَيْنَاهُ تَذْرِفَانِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5050]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో, «నాకు చదివి వినిపించు» అన్నారు. నేను, “ఓ రసూలుల్లాహ్! నేను మీకు చదివి వినిపించాలా, ఇది మీపైనే కదా అవతరించింది?” అని అన్నాను. ఆయన, «అవును» అన్నారు. అప్పుడు నేను 'అన్నిసా' సూరహ్ పారాయణం చేస్తూ, ఈ వాక్యం దగ్గరికి చేరుకున్నాను: {మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి, నిన్ను వారందరిపై సాక్షిగా నిలబెట్టినప్పుడు వీరి పరిస్థితి ఏమిటి?} [అన్నిసా: 41], అప్పుడు ఆయన, «ఇక చాలు» అన్నారు. నేను ఆయన వైపు తిరిగి చూస్తే, ఆయన కళ్ళ నుండి ఏకధాటిగా కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి.
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 5050]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్న్ మసూద్ రదియల్లాహు అన్హును ఖుర్ఆన్ నుండి కొంత భాగం చదివి వినిపించమని కోరారు. దానికి అతను, “ఓ రసూలుల్లాహ్! ఖుర్ఆన్ మీపైనే కదా అవతరించింది కదా! అలాంటప్పుడు నేను మీకు ఖుర్ఆన్ చదివి వినిపించటమేమిటి?” అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “నాకు ఇతరుల నుండి ఖుర్ఆన్ పారాయణం వినాలనిపిస్తోంది” అని అన్నారు. అప్పుడు అతను 'అన్నిసా' సూరహ్ లోని ఈ ఆయతు నుండి పారాయణం మొదలుపెట్టారు. అలా అతను పారాయణం చేస్తూ, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కుకు చేరుకున్నప్పుడు: {فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ، وَجِئْنَا بِكَ عَلَى هَؤُلاَءِ شَهِيدًا}. అంటే, "నీవు నీ ప్రభువు సందేశాన్ని వారికి చేరవేశావని నీ సమాజంపై నిన్ను సాక్షిగా మేము నిలబెట్టినప్పుడు, నీ పరిస్థితి మరియు నీ సమాజం పరిస్థితి ఏమవుతుంది?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, 'ఇక పారాయణం ఆపు' అని అన్నారు. ఇబ్నె మసూద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ఆయన వైపు తిరిగి చూడగా, ఆ పరిస్థితి యొక్క భయంతో మరియు తన సమాజంపై గల కరుణతో ఆయన కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తున్నాయి.