عَنْ عُبَيْدِ اللَّهِ بْنِ عَدِيِّ بْنِ الخِيَارِ قَالَ:
أَخْبَرَنِي رَجُلَانِ أَنَّهُمَا أَتَيَا النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حَجَّةِ الوَدَاعِ وَهُوَ يُقَسِّمُ الصَّدَقَةَ، فَسَأَلَاهُ مِنْهَا، فَرَفَّعَ فِينَا البَصَرَ وَخَفَّضَهُ، فَرَآنَا جَلْدَيْنِ، فَقَالَ: «إِنَّ شِئْتُمَا أَعْطَيْتُكُمَا، وَلَا حَظَّ فِيهَا لِغَنِيٍّ، وَلَا لِقَوِيٍّ مُكْتَسِبٍ».

[صحيح] - [رواه أبو داود والنسائي] - [سنن أبي داود: 1633]
المزيــد ...

ఉబైదుల్లాహ్ బిన్ అదీ బిన్ అల్-ఖియార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ఇద్దరు వ్యక్తులు నాకు ఇలా తెలిపారు: మేము హజ్జతుల్ విదా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాము. అప్పుడు ఆయన సదకా (దానధర్మాలు) పంచిపెడుతున్నారు. మేము కూడా దాని నుండి కొంత ఇవ్వమని ఆయనను అడిగాము. అప్పుడు ఆయన మమ్మల్ని పైనుంచి క్రింది వరకు చూశారు. మేము దృఢంగా ఉన్నట్లు గమనించి, ఇలా అన్నారు: «మీరు కోరుకుంటే నేను మీకు ఇస్తాను, కానీ ఇందులో ధనవంతునికి ఎలాంటి వాటా లేదు, అలాగే సంపాదించగల శక్తిమంతునికి కూడా (వాటా) లేదు».

[ప్రామాణికమైన హదీథు] - [అబూ దావూద్ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:] - [సునన్ అబీదావూద్ - 1633]

వివరణ

హజ్జతుల్ విదా సందర్భంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సదఖా పంచుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆయన వద్దకు వచ్చి, దాని నుండి తమకు కూడా ఇవ్వమని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి సదఖా తీసుకోవడం ధర్మసమ్మతమా కాదా అని వారి పరిస్థితిని తెలుసుకోవడానికి, వారిద్దరి వైపు పదేపదే చూసారు. ాయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరినీ బలవంతులుగా చూసి, ఇలా అన్నారు: మీరు కోరుకుంటే నేను మీకు సదాఖా నుండి ఇస్తాను, కానీ ఇందులో తనకు సరిపడా ధనం ఉన్నవారికి మరియు అతని వద్ద సంపన్నుడిగా పరిగణించబడేంత ధనం లేకపోయినప్పటికీ కష్టపడి సంపాదించగల శక్తి ఉన్నవారికి ఎలాంటి వాటా లేదు.

من فوائد الحديث

  1. ధనవంతుడు లేదా సంపాదించే శక్తిగలవాడు ధానం చేయమని అడగడం నిషేధించబడింది.
  2. వాస్తవానికి ఎవరి వద్ద ఆస్తి ఉండదో, అలాంటి వారు సదఖా దానము మరియు జకాతు దానము పొందే అర్హత కలిగి ఉంటారు.
  3. కేవలం శక్తి దానధర్మానికి అనర్హతను కలిగించదు, దానికి బదులుగా సంపాదించే సామర్థ్యం కూడా జతచేయబడాలి.
  4. తనకు సరిపడా సంపాదించగల సామర్థ్యం ఉన్నవారు జకాత్ తీసుకోవడానికి వీలు లేదు; ఎందుకంటే ధనంతో ధనికుడు స్వయం సమృద్ధిగా ఉన్నట్లుగా, అతను సంపాదన ద్వారా స్వయం సమృద్ధిగా ఉన్నాడు.
  5. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప శిక్షణ, ముస్లిం వ్యక్తిత్వానికి ఆత్మగౌరవాన్ని మరియు తీసుకోవడం, యాచించడం, సోమరితనం కాకుండా ఇవ్వడాన్ని నేర్పుతుంది.
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఇంకా (28)
ఇంకా