عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلَّى اللَّهُ عليْه وسلَّمَ، قَالَ:
«إِذَا أُقِيمَتِ الصَّلَاةُ فَلَا صَلَاةَ إلَّا المَكْتُوبَةُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 710]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«నమాజ్ కోసం ఇఖామత్ చెప్పబడిన తర్వాత ఫర్ద్ నమాజ్ తప్ప మరే నమాజు లేదు»

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 710]

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఫర్ద్ నమాజు కోసం ఇఖామత్ పలకబడిన తరువాత మస్జిద్ లో ఉన్నవారు నఫిల్ లేదా సున్నతు నమాజు ప్రారంభించడాన్ని నిషేధించారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఫర్ద్ నమాజు కొరకు ఇఖామత్ ఇచ్చినపుడు మస్జిదులో నఫిల్ నమాజు చేయడం నిషేధించబడింది.
  2. ఇఖామత్ తర్వాత నఫిల్ నమాజు ప్రారంభించడం నిషేధించబడింది, అది ఫజర్ మరియు జొహర్ సున్నత్ లాంటి సునన్ అర్రాతిబా సున్నత్ అయినా లేదా ఇతరమైనవి అయినా.
  3. ఫర్ద్ నమాజు కొరకు ఇఖామత్ ఇచ్చినపుడు ఎవరైనా నఫిల్ నమాజులో ఉంటే; ఒకవేళ దానిలో ఒక రకాతు కన్నా తక్కువ మిగిలి ఉంటే, దానిని తక్షణంగా ముగించాలి, లేకపోతే, తక్బీరె తహ్రీమా యొక్క ఘనతను పొందడానికి దానిని మధ్యలోనే నిలిపివేయాలి.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإندونيسية ఇంకా (28)
ఇంకా