عَنْ مُعَاذٍ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لَمَّا وَجَّهَهُ إِلَى الْيَمَنِ أَمَرَهُ أَنْ يَأْخُذَ مِنَ الْبَقَرِ مِنْ كُلِّ ثَلَاثِينَ تَبِيعًا أَوْ تَبِيعَةً، وَمِنْ كُلِّ أَرْبَعِينَ مُسِنَّةً، وَمِنْ كُلِّ حَالِمٍ -يَعْنِي مُحْتَلِمًا- دِينَارًا أَوْ عَدْلَهُ مِنَ المَعَافِرِ، ثِيَابٌ تَكُونُ بِالْيَمَنِ.

[صحيح بشواهده] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 1576]
المزيــد ...

ము’ఆద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని యమన్‌కు పంపినప్పుడు, అతనికి ఇలా ఆదేశించారు: ఆవుల విషయంలో, ప్రతీ ముప్పై ఆవుల నుండి ఒక మగ లేదా ఆడ దూడను తీసుకోవాలి, మరియు ప్రతీ నలభై ఆవుల నుండి ఒక ముసన్నను (రెండు సంవత్సరాల ఆడ దూడను) తీసుకోవాలి, మరియు ప్రతీ యుక్తవయస్కుడి నుండి - అనగా యుక్తవయస్సు వచ్చినవాడి నుండి - ఒక దీనారు లేదా దానికి సమానమైన మఆఫిర్, అనగా యమన్‌లో ఉండే వస్త్రాలను తీసుకోవాలి.

[సాక్ష్యాల ఆధారంగా ప్రామాణికమైనది] - [అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:] - [సునన్ అబీదావూద్ - 1576]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్, ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు’ను ప్రజలకు విద్యను బోధించడానికి మరియు వారిని ఇస్లాం వైపు ఆహ్వానించడానికి యమన్ వైపుకు పంపిస్తూ, ఆయన అతనికి ఇలా ఆదేశించినారు: ముస్లింల నుండి వారి ఆవుల జకాత్‌ను తీసుకోవాలి, ప్రతీ ముప్పై ఆవుల నుండి ఒక సంవత్సరం నిండిన మగ దూడ (తబీఅ) లేదా ఆడ దూడ (తబీఅ) తీసుకోవాలి, మరియు ప్రతీ నలబై ఆవుల నుండి రెండు సంవత్సరాలు నిండిన ఒక ఆడ దూడ (ముసిన్నహ్) తీసుకోవాలి. మరియు గ్రంథ ప్రజలైన యూదులు మరియు క్రైస్తవులలోని ప్రతీ యవ్వనుడైన పురుషుని నుండి ఒక దీనారు, లేదా ఒక దీనారుకు సమానమైన 'మఆఫిరి' అని పిలువబడే యెమెన్ వస్త్రాలను జిజియాగా తీసుకోవాలి.

من فوائد الحديث

  1. జిజియా యుక్తవయస్సుకు చేరుకున్న వారి నుండి తప్ప వసూలు చేయబడదు; ఎందుకంటే, ఎవరి నుండి ఇది వసూలు చేయబడదో దాని నియమం: యుద్ధఖైదీగా పట్టుబడినప్పుడు ఎవరినైతే చంపడం నిషేధమో అలాంటి వారే: చిన్నపిల్లలు, స్త్రీలు మరియు ఇతరులు.
  2. జిజియా యొక్క పరిమాణాన్ని నిర్ణయించడం ఇమామ్ యొక్క ఇజ్తిహాద్ పై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే అది ప్రదేశము, కాలము, ధనిక మరియు పేదరికాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దీనికి నిదర్శనం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యమన్ వాసులపై దానిని నిర్ణయించారు. ఆయన ముఆద్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు: “ప్రతీ యుక్తవయస్కుడైన పురుషుని నుండి ఒక దీనారు తీసుకో”. అయితే ఉమర్ రదియల్లాహు అన్హు షామ్ వాసులపై జిజియాను నిర్ణయించినప్పుడు దాని పరిమాణం పెరిగింది.
  3. జకాత్ సేకరణ పట్ల శ్రద్ధ చూపడం, దానిని సేకరించేవారిని నియమించడం పాలకుని విధులలో ఒకటి.
  4. తబి' అంటే ఒక సంవత్సరం పూర్తి చేసుకుని, రెండవ సంవత్సరంలో ప్రవేశించినది. అది ఇంకా తన తల్లిని అనుసరిస్తున్నందున దానికి తబి' అనే పేరు పెట్టబడింది.
  5. దీనార్: ఒక బంగారు నాణెం మరియు ఇస్లామీయ దీనార్ బరువు 4.25 గ్రాముల బంగారానికి సమానం.
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఇంకా (31)
ఇంకా