عَنْ أُمِّ عَطِيَّةَ رَضيَ اللهُ عنها قَالَتْ:
تُوُفِّيَتْ إِحْدَى بَنَاتِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَخَرَجَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: «اغْسِلْنَهَا ثَلاَثًا، أَوْ خَمْسًا أَوْ أَكْثَرَ مِنْ ذَلِكَ، إِنْ رَأَيْتُنَّ بِمَاءٍ وَسِدْرٍ، وَاجْعَلْنَ فِي الآخِرَةِ كَافُورًا -أَوْ شَيْئًا مِنْ كَافُورٍ-، فَإِذَا فَرَغْتُنَّ فَآذِنَّنِي»، قَالَتْ: فَلَمَّا فَرَغْنَا آذَنَّاهُ، فَأَلْقَى إِلَيْنَا حِقْوَهُ، فَقَالَ: «أَشْعِرْنَهَا إِيَّاهُ»، وَقَالَتْ: وَجَعَلْنَا رَأْسَهَا ثَلاَثَةَ قُرُونٍ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1258]
المزيــد ...
ఉమ్మ అతియ్యహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ యొక్క కుమార్తెలలో ఒకరు మరణించారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ బయటకు వచ్చి (అక్కడి స్త్రీల వద్దకు వచ్చి) ఇలా అన్నారు: «మీరు ఆమెను మూడు సార్లు లేక ఐదు సార్లు లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువసార్లు నీటితో మరియు సిద్ర్ తో (రేగిపండు ఆకులతో చేసిన మిశ్రమం) బాగా కడగండి. చివరిసారి కడిగేటప్పుడు కాఫూర్ లేదా కాఫూర్ లో నుండి కొంతభాగాన్ని ఉపయోగించండి’ మీరు ముగించిన తరువాత నాకు తెలియజేయండి», మేము ముగించిన తరువాత ఆయనకు తెలిపినాము, అపుడు ఆయన తన వస్త్రాన్ని మాకు ఇచ్చి, దాన్ని ఆమె శరీరానికి చుట్టమని చెప్పారు. మరియు ఆమె ఇంకా ఇలా అన్నారు, 'మేము ఆమె తలవెంట్రుకలను మూడు జడలుగా చేశాము'.
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 1258]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా మరణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఆమెకు గుసుల్ చేయించే స్త్రీల వద్దకు వచ్చి ఇలా చెప్పారు: "ఆమెకు నీటితో’ రేగుఆకులతో బేసి సంఖ్యలో మూడు సార్లు, లేదా ఐదు సార్లు, లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువ సార్లు గుసుల్ చేయించండి. చివరి గుసుల్ లో కొంచం కాఫూర్ ను ఉపయోగించండి. మీరు ముగించిన తరువాత నాకు తెలియజేయండి. ఆమెకు గుసుల్ చేయించడం పూర్తి చేసిన తర్వాత, వారు ఆయనకు తెలుపగా, ఆయన గుసుల్ చేయించిన మహిళలకు తన ఇజార్ ను ఇచ్చి, ఇలా అన్నారు: ‘ఆమెను దీనిలో చుట్టండి, దీనినే ఆమె శరీరానికి తగిలి ఉండే వస్త్రంగా చేయండి’. ఆ తర్వాత, ఆమె జుట్టును మూడు జడలుగా అల్లారు.