عَنْ عَلِيٍّ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
بَعَثَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سَرِيَّةً فَاسْتَعْمَلَ رَجُلًا مِنَ الأَنْصَارِ، وَأَمَرَهُمْ أَنْ يُطِيعُوهُ، فَغَضِبَ، فَقَالَ: أَلَيْسَ أَمَرَكُمُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ تُطِيعُونِي؟ قَالُوا: بَلَى، قَالَ: فَاجْمَعُوا لِي حَطَبًا، فَجَمَعُوا، فَقَالَ: أَوْقِدُوا نَارًا، فَأَوْقَدُوهَا، فَقَالَ: ادْخُلُوهَا، فَهَمُّوا، وَجَعَلَ بَعْضُهُمْ يُمْسِكُ بَعْضًا، وَيَقُولُونَ: فَرَرْنَا إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ النَّارِ، فَمَا زَالُوا حَتَّى خَمَدَتِ النَّارُ، فَسَكَنَ غَضَبُهُ، فَبَلَغَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: «لَوْ دَخَلُوهَا مَا خَرَجُوا مِنْهَا إِلَى يَوْمِ القِيَامَةِ؛ الطَّاعَةُ فِي المَعْرُوفِ».
المزيد
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దళాన్ని పంపినారు, అన్సార్లలోని ఒక వ్యక్తిని వారిపై నాయకుడిగా నియమించారు. మరియు అతనికి విధేయత చూపమని వారికి ఆదేశించారు. ఒకసారి అతనికి కోపం వచ్చి, ఇలా అన్నాడు: "నాకు విధేయత చూపమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని ఆదేశించలేదా?" వారు, "అవును" అని అన్నారు. అప్పుడు అతను, "నా కోసం కట్టెలు సేకరించండి" అని అన్నాడు. వారు సేకరించారు. ఆపై, "అగ్నిని రాజేయండి" అని అన్నాడు. వారు రాజేశారు. ఆ తర్వాత, "దానిలో ప్రవేశించండి" అని అన్నాడు. వారు అందులో ప్రవేశించడానికి సిద్ధపడగా, ఒకరినొకరు పట్టుకుంటూ, "మేము అగ్ని నుండి తప్పించుకోవడానికే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది" అని అన్నారు. అగ్ని ఆరిపోయి, అతని కోపం చల్లారే వరకు వారు అలాగే ఉండిపోయారు. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరినప్పుడు, ఆయన ఇలా సెలవిచ్చారు: «ఒకవేళ వారు దానిలో ప్రవేశించి ఉంటే, ప్రళయదినం వరకు దాని నుండి బయటకు వచ్చేవారు కాదు; విధేయత అనేది కేవలం ధర్మబద్ధమైన (మంచి) విషయాలలో మాత్రమే చూప వలసి ఉంటుంది».